దర్బంగా పేలుడు కేసు: సూత్రధారి సలీమ్.. ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌కు, పాక్ నుంచి నిధులు

By Siva KodatiFirst Published Jul 2, 2021, 7:09 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్బంగా పేలుడు కేసు కీలక మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సంచలన విషయాలను వెలికితీస్తోంది ఎన్ఐఏ. దర్భంగా పేలుడు కేసులో సలీమ్‌ని సూత్ర‌ధారిగా తేల్చింది. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్బంగా పేలుడు కేసు కీలక మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ కేసులో సంచలన విషయాలను వెలికితీస్తోంది ఎన్ఐఏ. దర్భంగా పేలుడు కేసులో సలీమ్‌ని సూత్ర‌ధారిగా తేల్చింది. యూపీ నుంచి ఫిబ్రవరిలో సలీమ్‌ హైదరాబాద్‌కు వచ్చాడు. ఇమ్రాన్, నాసిర్‌లతో రోజుల తరబడి సలీమ్ భేటీ అయినట్లుగా ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

ఐఈడీ బాంబుల తయారీలో ఇమ్రాన్, నాసిర్‌లకు సలీమ్ శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నడుస్తున్న ట్రైన్‌లో బాంబులు పేల్చాలని కుట్ర పన్నారు వీరు. దర్భంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని రెండు బోగీలను పేల్చేయాలని ప్లాన్ చేశారు. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబాతో హాజీ సలీమ్‌కు సంబంధాలు వున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఎల్‌ఈటీ ఆపరేటర్ ఇక్బాల్ ఖన్నాతో లింక్ వున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:దర్భాంగా పేలుడు: మరో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్

పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టానికి ఇక్బాల్ ఖన్నా, హాజీ సలీమ్ కుట్రపన్నినట్లుగా ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఇందుకోసం పాకిస్తాన్ నుంచి నిధులు తెప్పించినట్లుగా గుర్తించారు. కోడ్ భాషలో నాసిర్ సోదరులతో సలీమ్ మాట్లాడాడు. కోడ్ భాషను డీకోడ్ చేసే ప్రయత్నంలో ఎన్ఐఏ వుంది. దర్భంగా కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. 

click me!