Summit for Democracy: భార‌త ప్ర‌జాస్వామ్యానికి అవే మూల స్తంభాలు.. ప్ర‌ధాని మోడీ

Published : Dec 10, 2021, 10:57 AM IST
Summit for Democracy:  భార‌త ప్ర‌జాస్వామ్యానికి అవే మూల స్తంభాలు.. ప్ర‌ధాని మోడీ

సారాంశం

Summit for Democracy:  సునిశితత్వం, జవాబుదారీతనం, సంస్కరణల్లో భాగస్వామ్యం కావడం, సమ్మిళిత అభివృద్ధిని సాధించడమే భారత ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలుగా నిలిచాయని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. Summit for Democracy శిఖ‌రాగ్ర స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ, అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌తో వర్చువల్ భేటీ అయ్యారు.   

Summit for Democracy: భారతీయుల్లో ప్రజాస్వామ్య స్పూర్తి నాటుకుపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ నిర్వహించిన 'సమ్మిట్ ఫర్ డెమోక్రసీ'లో  పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ, చట్టబద్ధమైన పాలన, బహువచన భావాలతో సహా ప్రజాస్వామ్య స్ఫూర్తి "భారతీయులలో నాటుకుపోయిందని" చెప్పారు. వర్చువల్ విధానంలో బైడెన్ తో ఆయన భేటీ అయ్యారు.  Summit for Democracy సమావేశం తొలి రోజు నరేంద్ర మోడీ సహా 12 దేశాలకు చెందిన దేశాధినేతలు సైతం పాలుపంచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం నేపథ్యంలో ఈ స‌మావేశం కొన‌సాగుతున్న‌ది. దీనిలో భాగంగా ఆయా దేశాల‌కు చెందిన దేశాధినేత‌లు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దేశాధినేత‌ల‌తో పాటు మొత్తం 80 దేశాల ప్రతినిధులు సైతం  ఇందులో పాల్గొన్నారు.  Summit for Democracy తొలిరోజు అమెరికా అధ్య‌క్షుడు బో బైడెన్, భారత ప్ర‌ధాని మోడీ స‌హా ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్, అర్జెంటీనా, ఉరుగ్వే, జపాన్, ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్ దేశాధినేతలు సైతం ప్ర‌సంగించారు. 

Also Read: CPJ report: పెరుగుతున్న జ‌ర్న‌లిస్టుల జైలు నిర్బంధాలు

 Summit for Democracy వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ..   సునిశితత్వం, జవాబుదారీతనం, సంస్కరణల్లో భాగస్వామ్యం కావడం, సమ్మిళిత అభివృద్ధిని సాధించడమే భారత ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలుగా నిలిచాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌జాస్వామ్యానికి భార‌త్ పుట్టినిల్లు వంటిద‌ని చెప్పారు.  ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డానికి తాము అన్ని దేశాల‌తో క‌లిసి ముందుకు సాగుతామ‌ని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, రూల్ ఆఫ్ లా అనేది భారత పౌరుల్లో జీర్ణించుకుపోయిందని పేర్కొన్నారు. ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో ఉన్న ప్ర‌వాస భార‌తీయులు సైతం ఈ మూలాల‌ను విస్మ‌రించ‌టం లేద‌న్నారు. ఇది భార‌తీయుల్లో నిండుకుపోయిన ప్ర‌జాస్వామ్య స్పూర్తికి నిద‌ర్శ‌న‌మంటూ పేర్కొన్నారు. 

Also Read: vijaya sai reddy: మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. రాష్ట్ర పెండింగ్ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ

అలాగే,  తాము రచించుకున్న రాజ్యాంగానికి లోబడి.. ప్రతి ఒక్క పౌరుడికీ సమన్యాయాన్ని అందించమే సిసలైన ప్రజాస్వామ్యంగా తాము భావిస్తామ‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు.  ప్రజాస్వామ్య పరిరక్షణను దేశ పౌరులు తమ బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు.  ప్రజాస్వామ్య మూల సూత్రాలు.. గ్లోబల్ గవర్నెన్స్‌కు కేంద్ర బిందువు కావాలన్నారు. ప్ర‌జాస్వామ్యం అంటేనే ప్ర‌జ‌లు.. కాబ‌ట్టి ప్ర‌జాస్వామ్యంలో  ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏదీ విజయవంతం కాబోదన్నారు. ఈ విష‌యం ప్ర‌జ‌లు గుర్తుంచుకోవాల‌న్నారు. అలాగే, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని గుర్తుచేస్తూ.. క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌లు అందించిన మ‌ద్ద‌తును గురించి మాట్లాడారు. భార‌త ప్ర‌జ‌లంద‌రీ స‌హ‌కారంతోనే లాక్‌డైడ్ విజ‌య‌వంత‌మైంద‌ని అన్నారు.  అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్  మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకోవాల్సిన అవసరముంద‌న్నారు. అలాగే, జాతిపిత మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా సేవ‌ల‌ను కొనియాడారు.  

Also Read: Omicron: ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే ఎక్కువే .. జ‌పాన్ సైంటిస్టులు ఎమ‌న్నారంటే?

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్