2020-21 ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ కూడ తిరోగమనంలోనే ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు.నాలుగు కేటగిరిలుగా ఆర్ధిక వ్యవస్థను పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు.
ముంబై: 2020-21 ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ కూడ తిరోగమనంలోనే ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అభిప్రాయపడ్డారు.నాలుగు కేటగిరిలుగా ఆర్ధిక వ్యవస్థను పెంచేందుకు చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారంనాడు ఉదయం ముంబైలో మీడియాతో మాట్లాడారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా ముందుకు వచ్చారు.
undefined
also read:గుడ్‌న్యూస్: మరో మూడు మాసాలు రుణాలపై మారటోరియం విధింపు
లాక్ డౌన్ నిబంధనలపై ద్రవ్యోల్బణం ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో ఆహార భద్రతకు భరోసా ఉందని ఆయన స్పష్టం చేశారు. సిడ్జీ రుణాల మారటోరియం మరో 90 రోజులు పొడిగిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. భారత పారెక్స్ నిల్వలు 9.2 బిలియన్లకు పెరిగినట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. ఫారెక్స్ నిల్వలు రూ.487 బిలియన్ డాలర్లకు చేరుకొన్నాయి. ఇది ఏడాది దిగుమతులతో సమానమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.
ఎగుమతులు, దిగుమతులను పెంచే విధంగా చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. వర్కింగ్ కేపిటల్ పెంచే విధంగా చర్యలుు తీసుకొంటున్నామన్నారు. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆర్భీఐ గవర్నర్ వివరించారు.