మరో పరువు హత్య.. ప్రేమజంటను హత్య చేసి.. మృతదేహాలను

Published : Feb 12, 2019, 01:41 PM IST
మరో పరువు హత్య.. ప్రేమజంటను హత్య చేసి.. మృతదేహాలను

సారాంశం

మరో పరువు హత్య కలకలం రేపింది. తమ కుమార్తె వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో.. ఆ యువతి తండ్రి ప్రేమజంటను దారుణంగా హతమార్చాడు.

మరో పరువు హత్య కలకలం రేపింది. తమ కుమార్తె వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో.. ఆ యువతి తండ్రి ప్రేమజంటను దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన బిహార్ లోని గయలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గయాకి చెందిన ఇద్దరు యువతీ యువకులు సంవత్సరకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలను కోరగా.. అందుకు వారు నిరాకరించారు. దీంతో.. యువతి.. సదరు యువకుడిని పెళ్లిచేసుకుంది. తన పుట్టింటికి వెళ్లనని తేల్చిచెప్పి.. అత్తారింట్లో అడుగుపెట్టింది.

తమ కుమార్తెను ఆ యువకుడు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడంటూ.. సదరు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ అమ్మాయి అసలు నిజం చెప్పడంతో యువకుడిని పోలీసులు విడుదల చేశారు. ఎంత విడదీయాలని ప్రయత్నించినా.. వారు విడిపోవడం లేదని యువతి తండ్రి కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా.. తన సోదరుడి సహాయంతో కూతురు, అల్లుడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాలను తగలపెట్టాడు. దీనిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  మృతదేహాల ఎముకలను స్వాధీనం చుసుకొని డీఎన్ఏ పరీక్షల కోసం పంపినట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu
PM Modi Visit Oman: ఒమన్ లో మోదీకి ఘనస్వాగతంభారత ప్రజలు | Asianet News Telugu