‘‘వెళ్లి ఓ మూలన కూర్చో’’..సీబీఐ మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావుపై సీజేఐ ఫైర్, లక్ష జరిమానా

By Siva KodatiFirst Published Feb 12, 2019, 12:25 PM IST
Highlights

సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కోర్టు అనుమతి లేకుండా సీబీఐ అధికారిని బదిలీ చేసినట్లు తేలడంతో ఆయనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తులో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలడంతో ఆయనకు లక్ష రూపాయలు జరిమానా విధించింది. 
 
బీహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి ఏకే శర్మను నాగేశ్వరరావు బదిలీ చేశారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ హోదాలో విధాన నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం ఇంతకు ముందు నాగేశ్వరరావును ఆదేశించింది.

కానీ బీహార్ షెల్టర్ హోమ్ కేసును విచారిస్తున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మను నాగేశ్వరరావు బదిలీ చేశారు. దీనిని సుప్రీం తీవ్రంగా పరిగణిస్తూ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే ఆయన న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించారు. ఏకే శర్మను బదిలీ చేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని... మీరు సుప్రీం ఆదేశాలతో ఆడుకున్నారని చీఫ్ జస్టిస్ రంజాన్ గొగోయ్ మండిపడ్డారు.

ఈ సమయంలో ఆగ్రహానికి లోనైన సీజేఐ.. నాగేశ్వరరావును వెళ్లి ఓ మూలన కూర్చోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏకే శర్మను బదిలీ చేసిన ప్రక్రియలో ఇంకా ఏయే అధికారులు ఉన్నారో వారి పేర్లు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. దీనిపై నాగేశ్వరరావు భేషరతుగా క్షమాపణలు చెప్పినప్పటికీ.. దానిని తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం ఆయనకి రూ. లక్ష రూపాయలు జరిమానా విధించింది. 

click me!