ఈడీ ఎదుట తల్లితో కలిసి హాజరైన రాబర్ట్ వాద్రా

By narsimha lode  |  First Published Feb 12, 2019, 12:36 PM IST

బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.



న్యూఢిల్లీ: బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.

బికనీర్ భూ కుంభకోణం విషయమై విచారణకు హాజరుకావాలని వాద్రాకు ఇప్పటికే ఈడీ మూడు దఫాలు  నోటీసులు పంపింది. కానీ,  ఇంతవరకు  ఆయన విచారణకు హాజరుకాలేదు.కానీ, ఈ కేసులో తల్లితో కలిసి వాద్రా ఇవాళ  ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు.  

బికనీర్ భూ కుంభకోణంపై 2015లో ఈడీ కేసు నమోదు చేసింది. బికనీర్ తహాసీల్దార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఈ భూమిని కేటాయించారని  ఆయన ఫిర్యాదు చేశారు.  రాబర్ట్ వాద్రాతో ఈడీ ముందు హాజరుకావడంతో ప్రియాంక గాంధీ కూడ లక్నో నుండి రాజస్తాన్‌కు బయలుదేరారు.

click me!