Gautam Adani: మీడియాలో అదానీ సామ్రాజ్య విస్తరణ.. మొన్న ఎన్డీటీవీ, నేడు ఏకంగా న్యూస్ ఏజెన్సీనే

By Mahesh K  |  First Published Dec 16, 2023, 3:10 PM IST

బిలియనీర్ గౌతమ్ అదానీ మీడియా రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఏడాది క్రితం ఎన్డీటీవీని చేతుల్లోకి తీసుకున్న అదానీ గ్రూపు నేడు న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్‌లో 50.50 శాతం స్టేక్ అదుపులోకి తీసుకుంది.
 


Gautam Adani: బిలియనీర్ గౌతమ్ ఆదానీ మీడియా రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇటీవలే జాతీయ మీడియా చానెల్ ఎన్డీటీవీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఏకంగా వార్తా ఏజెన్సీలోనే మెజార్టీ స్టేక్‌ను కైవసం చేసుకుంది. న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్‌లో 50.50 శాతం స్టేక్‌ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ న్యూస్ ఏజెన్సీని అదానీ గ్రూపు కంట్రోల్ చేస్తుంది. అదానీ గ్రూపు‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్(ఏఎంఎన్ఎల్) మీడియా సంబంధ వ్యవహారాలను హ్యాండిల్ చేస్తుంది. 

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయం తెలియవచ్చింది. ఏఎంఎన్ఎల్ న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లోని 50.50 శాతం స్టేక్ కొనుగోలు చేసింది. అయితే, ఎంత మొత్తం వెచ్చించి ఆ షేర్లు కొనుగోలు చేసినందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.

Latest Videos

undefined

అదానీ గతనెల మార్చి నెలలో మీడియా రంగంలో అడుగుపెట్టింది. అప్పుడు క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత డిసెంబర్‌లో బ్రాడ్ క్యాస్టర్ ఎన్డీటీవీలో 65 శాతం స్టేక్ కొనుగోలు చేసింది.

Also Read : Year Ender 2023: ఈ ఏడాది ప్రపంచ దేశాలు భారత్ గురించి ఏం సెర్చ్ చేశాయి?

ఐఏఎన్ఎస్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.86 కోట్ల రాబడి సాధించింది. ఐఏఎన్ఎష్‌కు సంబంధించి అన్ని ఆపరేషనల్, మేనేజ్‌మెంట్ కంట్రోల్స్ ఏఎంఎన్ఎల్ చేతిలో ఉంటాయని, ఐఏఎన్ఎస్ డైరెక్టర్లు అందరినీ నియమించే హక్కు ఏఎంఎన్ఎల్‌కు ఉంటుందని ఆ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అదానీ గ్రూపు వెల్లడించింది.

click me!