డబ్బుందని పొగరు...మహిళపై మనీ విసిరిన వ్యక్తి !

Published : Feb 06, 2023, 02:12 PM IST
 డబ్బుందని పొగరు...మహిళపై మనీ విసిరిన వ్యక్తి !

సారాంశం

ఓ వ్యక్తి లగ్జరీ కారులో పెట్రోల్ బంక్ లోకి అడుగుపెట్టాడు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత... డబ్బులు బంక్ లో పనిచేసే మహిళ ముఖం పై విసిరేశాడు.  

డబ్బు ఉందని చాలా మంది పొగరు చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా డబ్బు లేని వారి పట్ల మరింత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తాజాగా... డబ్బు ఉందని ఓ వ్యక్తి పెట్రోల్ బంక్ లో పని చేసే మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఓ వ్యక్తి లగ్జరీ కారులో పెట్రోల్ బంక్ లోకి అడుగుపెట్టాడు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత... డబ్బులు బంక్ లో పనిచేసే మహిళ ముఖం పై విసిరేశాడు.

 

అనంతరం అక్కడి నుంచి వెళ్లాపోయాడు. కాగా.... అతను వెళ్లిన తర్వాత... ఆమె ఆ డబ్బులను ఏరుతూ కనిపించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అతను చేసిన పనికి ఆ మహిళ చాలా బాధ పడటం గమనార్హం. ఆమె కన్నీళ్లు తుడుచుకోవడం కూడా వీడియోలొ స్పష్టంగా కనపడుతోంది.

కాగా... సదరు మహిళ పట్ల అంందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అతనిపై మాత్రం అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళ పట్ల అతను గౌరవం చూపించకపోవడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మొత్తం 50 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. సదరు కారు యజమానిని మాత్రం భయంకరంగా విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial