గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు అస్వస్థత.. హాస్పిటల్ కు తరలించిన జైలు అధికారులు

Published : Jul 11, 2023, 01:21 PM IST
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు అస్వస్థత.. హాస్పిటల్ కు తరలించిన జైలు అధికారులు

సారాంశం

సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు అతడిని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడు పంజాబ్ లోని గురు గోవింద్ సింగ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్  లో చికిత్స పొందుతున్నారు. 

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోమవారం రాత్రి అతడిని గురు గోవింద్ సింగ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు అధికారులు తరలించారు. సింగర్ సిద్ధూ మూస్ వాలా హత్య కేసులో బటిండా జైలు లో అతడు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 

తాగిన మైకంలో పోలీసులకే ఫోన్ చేసి.. ప్రధాని, సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తి.. తరువాత ఏమైందంటే ?

బిష్ణోయ్ గత కొంతకాలంగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని బిష్ణోయ్ తరఫు న్యాయవాది తెలిపారు. జూలై 4 నుంచి సావన్ కోసం నిరాహార దీక్ష చేస్తున్న బిష్ణోయ్ కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. 

అంతకుముందు జూన్ 14న ఢిల్లీ కోర్టు బిష్ణోయ్‌ను దోపిడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అతడి పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత గ్యాంగ్‌స్టర్‌ను సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ పోలీసులు 30 ఏళ్ల బిష్ణోయ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి కోరిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

పరీక్ష రాసేందుకు వెళ్లిన తల్లి.. పసికందును ఆడిస్తూ, విధులు నిర్వర్తించిన మహిళా కానిస్టేబుల్.. ఫొటోలు వైరల్

ఇదిలావుండగా.. మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్ పీజీ దాడితో సహా వివిధ క్రిమినల్ కేసులతో సంబంధం ఉన్న తన ముఠా సభ్యులకు ఆశ్రయం ఇచ్చినందుకు జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కీలక సహచరుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఆయనను కేంద్ర దర్యాప్తు సంస్థ మంగళవారం అదుపులోకి తీసుకుంది.

ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది.. ఢిల్లీకి పొంచి ఉన్న వరద ముప్పు

2022 మేలో మొహాలీలోని ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై ఆర్పీజీ దాడి చేసిన ఫైజాబాద్ కు చెందిన దీపక్ సురఖ్పూర్, దివ్యాన్షులకు ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన వికాస్ సింగ్ ఆశ్రయం కల్పించాడు. ఆ నిందితులద్దరికీ వికాస్ సింగ్ అయోధ్యలోని దేవ్ గడ్ గ్రామంలోని తన ఇంట్లో, తన ఫ్లాట్ లో పలుమార్లు ఆశ్రయం ఇచ్చినట్లు అతడు వెల్లడించినట్లు ఎన్ఐఏ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !