నన్ను తప్పుగా చూపించారు.. ‘సంజు’ నిర్మాతలపై అబూసలేం ఫైర్.. నోటీసులు

First Published Jul 27, 2018, 5:10 PM IST
Highlights

ప్రముఖ నటుడు సంజయ్‌దత్ జీవితకథ ఆధారంగా రాజ్‌కుమార్ హీరాణీ నటించిన చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది విజయవంతంగా దూసుకెళ్తోంది. సంజయ్‌దత్‌గా రణబీర్‌కపూర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు..

ప్రముఖ నటుడు సంజయ్‌దత్ జీవితకథ ఆధారంగా రాజ్‌కుమార్ హీరాణీ నటించిన చిత్రం విమర్శకుల ప్రశంసలు పొంది విజయవంతంగా దూసుకెళ్తోంది. సంజయ్‌దత్‌గా రణబీర్‌కపూర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఈ సినిమాలో సంజయ్‌దత్ వ్యక్తిగత జీవితం.. ముంబై బాంబు పేలుళ్లలో మాఫియాతో సంబంధాలు, అక్రమ ఆయుధాలు తదితర అంశాలను చూపించారు..

ఇందులో గ్యాంగ్‌స్టర్ అబూసలేం.. సంజయ్‌దత్‌కు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేసినట్లుగా చూపించారు. దీనిపై అబూసలేం మండిపడ్డాడు.. ఈ చిత్రంలో తనను తప్పుగా చూపించారని.. తానెప్పుడూ సంజయ్‌దత్‌ను కలవలేదని.. ఆయనకు ఆయుధాలు సరఫరా చేయలేదని అబూసలేం ఆరోపిస్తున్నాడు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సన్నివేశాలను రూపొందించినందుకు గాను దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ నిర్మాతలు.. విధు వినోద్ చోప్రా, ఫాక్స్‌స్టార్ స్టూడియోలకు లీగల్ నోటీసులు పంపాడు.

ఇందుకుగానూ తనకు ఆర్థిక పరిహారం చెల్లించాలని.. 15 రోజుల్లోగా సంజులో తన గురించి చూపించిన సన్నివేశాలను తొలగించాలని సలేం నోటీసుల్లో పేర్కొన్నాడు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన అబూసలేంకు టాడా కోర్టు జీవితఖైదును విధించింది.. ప్రస్తుతం అతడు జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. 1993 మార్చి 12న రెండు గంటల వ్యవధిలో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 257 మంది దుర్మరణం పాలయ్యారు. 

click me!