చాక్లెట్ల కోసం ఆశపడి.. ఉద్యోగం పొగొట్టుకున్న మహిళా కానిస్టేబుల్

First Published Jul 27, 2018, 1:27 PM IST
Highlights

చాకెట్ల కోసం కక్కుర్తిపడి ఉద్యోగం పొగొట్టుకుంది ఓ మహిళా కానిస్టేబుల్. చెన్నైలోని కీల్పాక్కం మహిళా పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నందిని నిన్న రాత్రి చెట్‌పేట్‌లోని నీలగిరి సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ చాక్లెట్ల ప్యాకెట్‌ను చోరీ చేస్తుండటాన్ని సూపర్‌ మార్కెట్ సిబ్బంది సీసీ కెమెరా ద్వారా గుర్తించి.. విచారించగా తాను తప్పు చేసినట్లు అంగీకరించింది. 

చాకెట్ల కోసం కక్కుర్తిపడి ఉద్యోగం పొగొట్టుకుంది ఓ మహిళా కానిస్టేబుల్. చెన్నైలోని కీల్పాక్కం మహిళా పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నందిని నిన్న రాత్రి చెట్‌పేట్‌లోని నీలగిరి సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ చాక్లెట్ల ప్యాకెట్‌ను చోరీ చేస్తుండటాన్ని సూపర్‌ మార్కెట్ సిబ్బంది సీసీ కెమెరా ద్వారా గుర్తించి.. విచారించగా తాను తప్పు చేసినట్లు అంగీకరించింది. ఇకపై ఏ తప్పు చేయనని లేఖ రాసి సిబ్బందికి అందజేసింది.

ఏడుస్తూ ఇంటికి వచ్చిన నందినిని ఆమె భర్త ఏం జరిగిందని ఆరా తీయగా... జరిగిన విషయాన్ని చెప్పింది.. దీంతో భర్త తన స్నేహితులతో కలిసి సూపర్‌ మార్కెట్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో వాటిని సిబ్బంది సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

ఇవి నగరంలో వైరల్ కావడంతో ఎగ్మూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని కానిస్టేబుల్ భర్తను అరెస్ట్ చేసి.. పరారీలో ఉన్న అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.. విషయం నగర పోలీస్ కమిషనర్‌ దృష్టికి చేరడంతో ఆయన నందినిని విచారణ పూర్తయ్యే వరకు విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా ఆదేశాలు జారీ చేశారు.. కాగా ఆమె చోరీ చేసిన చాక్లెట్ ప్యాకెట్ విలువ రూ.115 కావడం గమనార్హం.

click me!