కరోనాకు విరుగుడుగా గంగా జలం? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే?

By Mahesh KFirst Published Dec 22, 2022, 9:10 PM IST
Highlights

కరోనా వైరస్‌కు విరుగుడుగా గంగా జలం పని చేస్తుందని, దాన్ని కరోనా వైరస్ చికిత్సకు అందించడంపై పరిశోధనలు చేయాలని ఎన్ఎంసీజీకి పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ తరుణంలోనే ఎన్ఎంసీజీ రెండు ప్రతిపాదనలను ఐసీఎంఆర్‌కు పంపింది. ఈ అంశాలపై తాజాగా కేంద్రం స్పందిస్తూ తమకు అలాంటి విజ్ఞప్తులేవీ రాలేవని స్పష్టం చేసింది.
 

న్యూఢిల్లీ: కరోనాకు విరుగుడుగా గంగా జలాన్ని వినియోగించాలని, అటు వైపుగా ప్రయోగాలు, పరిశోధనలు చేయాలని పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ప్రయత్నాలు చేశారు. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) విజ్ఞప్తులు పంపింది. దీనిపై నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా స్పందించింది. కరోనా వైరస్‌కు విరుగుడుగా గంగా జలాన్ని ఉపయోగించడంపై పరిశోధనలు చేపట్టడానికి తమకు ఎలాంటి విజ్ఞప్తులు అందలేవని మోడీ ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది.

ఎన్ఎంసీజీ మాత్రం రెండు ప్రతిపాదనలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు పంపింది. గంగా నది అవక్షేపాలు కొవిడ్ 19కు విరుగుడుగా పని చేస్తాయి, గంగా జలంతో కొవిడ్ 19కు చికిత్స అనే రెండు ప్రతిపాదనలను 2020 ఏప్రిల్ 28వ తేదీన పంపింది. ఈ ప్రతిపాదనలను పరీక్షించాలని కోరింది.

జల్ శక్తి మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఎన్ఎంసీజీ నదుల పునరుజ్జీవనానికి పాటుపడుతుంది. గంగా నదీని ప్రక్షాళన చేయాలని, తద్వారా కరోనా వైరస్‌కు గంగా నది నీటితో ట్రీట్‌మెంట్ విషయమై క్లినికల్ స్టడీస్ నిర్వహించాలని పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఎన్ఎంసీజీకి పెద్దమొత్తంలో విజ్ఞప్తులు చేశారు. 

Also Read: ఆ స‌మ‌యంలో ..300కు పైగా మృతదేహాలు గంగా పాలు

కానీ, ఈ విజ్ఞప్తులను ఐసీఎంఆర్ తిరస్కరించింది. సరిపడా శాస్త్రీయ సమాచారం (సైంటిఫిక్ డేటా) అవసరం అని పేర్కొంటూ ఆ ప్రపోజల్స్‌ను ఆదిలోనే అంతం చేసింది.

కాగా, కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్‌తో గంగా నది, దాని ఉపనదుల్లో నీటి నాణ్యత ఏమైనా పెరిగిందా? కోణంలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు, ఇతర ఏజెన్సీలు అధ్యయనాలు చేశాయి.

ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం లోక్ సభ లో ఓ ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఫేస్ మాస్క్ లు ధరించడం, హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించడంపై అవగాహన కల్పించాలని కోరారు. 

వైరస్ నిరంతరం అభివృద్ధి చెందు తోందని, ఇది ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా ఉందని, వాస్తవంగా ప్రతీ దేశాన్ని ప్రభావితం చేసే విధంగా ఉందని మాండవీయ లోక్ సభలో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 5.87 లక్షల కొత్త కేసులు నమోద వుతుండగా, భారత దేశంలో ప్రతి రోజూ సగటున 153 కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

click me!