గాలి జనార్ధన రెడ్డి దంపతుల వద్ద 84 కిలోల బంగారం, వజ్రాలు.. 437 కిలో వెండి -ఎన్నికల నామినేషన్ లో ఆస్తుల వెల్లడి

By Asianet News  |  First Published Apr 18, 2023, 9:50 AM IST

రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్ధన రెడ్డి దంపతులు పోటీ చేయనున్నారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష టిక్కెట్లపై ఈ సారి వారిద్దరూ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆయన భార్య జి.లక్ష్మీఅరుణ సోమవారం తన ఎన్నికల నామినేషన్ ను సమర్పించారు. అందులో వారి ఆస్తుల వివరాలను వెల్లడించారు. 


మైనర్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి దంపతుల వద్ద 84 కిలోల బంగారం, వజ్రాలు ఉన్నాయి. అలాగే 437 కిలోల వెండితో సహా రూ.250 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ విషయాన్ని గాలి జనార్ధన రెడ్డి సతీమణి జి.లక్ష్మీఅరుణ స్వయంగా వెల్లడించారు. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో బళ్లారి నగరం నుంచి ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ టికెట్ పై పోటీ చేస్తున్న ఆమె సోమవారం అధికారులకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో ఆమెకు ఉన్న ఆస్తులు, బంగారం ఇతరత్రా అంశాలను ప్రకటించారు. 

విషాదం.. రైస్ మిల్ బిల్డింగ్ కూలి ఇద్దరు కార్మికులు మృతి.. శిథిలాల కింద మరో 20 మంది..? ఎక్కడంటే ?

Latest Videos

గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన గాలి జనార్ధన రెడ్డి బీజేపీని వీడి సొంతంగా కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన కూడా ఈ సారి తన పార్టీ తరఫున ఉత్తర కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 

కాగా.. 47 ఏళ్ల లక్ష్మీఅరుణ తన భర్త కంటే తక్కువగానే బంగారం, వజ్రాలు కలిగి ఉన్నప్పటికీ.. పెట్టుబడుల విషయంలో ఆమె ముందంజలో ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం.. భర్త వద్ద 46 కిలోల వజ్రాలు, బంగారం ఉంది. అయితే భార్య వద్ద 38 కిలోల ఖరీదైన ఆభరణాలు ఉన్నాయి.

వానర సాయం.. పాడుబడిన బావిలో పడిపోయిన పిల్లి.. అల్లాడిపోతూ కాపాడిన కోతి.. వీడియో వైరల్

తాను, తన భర్త వ్యాపారం, వ్యవసాయంలో ఉన్నామని ప్రకటించిన లక్ష్మీఅరుణ.. హాస్పిటాలిటీ, ట్రావెల్, మైనింగ్, ఏవియేషన్, కెమికల్ రంగాల్లో డజనుకు పైగా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఆమె పెట్టుబడులు కలిపి రూ.79 కోట్లు కాగా, ఆమె భర్త పెట్టుబడులు సుమారు రూ.21 కోట్లుగా అంచనా వేశారు.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక ఏవియేషన్ కంపెనీని స్థాపించినప్పటికీ, ఈ జంటకు ఎలాంటి విమానాలు లేదా ఇతర వాహనాలు లేవు. కర్ణాటకలో మైనింగ్ బూమ్ తారాస్థాయికి చేరిన సమయంలో రెడ్డిలు హెలికాప్టర్లు, ప్రైవేట్ జెట్లలో బళ్లారి- బెంగళూరు మధ్య తిరిగేవారు.

వార్నీ.. మహిళను కాటేసిన పాము.. విషసర్పాన్ని కూడా హాస్పిటల్ కు తీసుకెళ్లిన భర్త.. యూపీలో వింత ఘటన

1992-93లో ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాల నుంచి బీఎస్సీ పూర్తిచేసిన లక్ష్మీఅరుణకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో 93 వ్యవసాయ ఆస్తులు ఉన్నాయి. 2008-2010 మధ్య మైనింగ్ బూమ్ సమయంలో ఎక్కువ భూమిని కొనుగోలు చేసినప్పటికీ, ఆమె 2021, 2022 లో బళ్లారి నగరంలో కొన్ని ప్లాట్లను కొనుగోలు చేశారు. ఎల్ఐసీ నుంచి వచ్చే రెమ్యునరేషన్, వడ్డీ, అద్దెలు, పెన్షన్లే తనకు ఆదాయ వనరు అని ఆమె తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.
 

click me!