రెడ్డి గారి కోతికొమ్మచ్చి ఆట: చెట్లెక్కి మామిడి కాయలు కోసిన గాలి

Siva Kodati |  
Published : May 22, 2019, 09:19 AM IST
రెడ్డి గారి కోతికొమ్మచ్చి ఆట: చెట్లెక్కి మామిడి కాయలు కోసిన గాలి

సారాంశం

గాలి జనార్థన్ రెడ్డి ఈ పేరు వినిపించగానే.. బళ్లారి కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యం, అక్రమ మైనింగ్ కేసులు, సీబీఐ, విలాసాలు, రాజభోగాలు గుర్తొస్తాయి. బిజినెస్, రాజకీయ వ్యవహారాలలో సీరియస్ వుండే గాలి చెట్లెక్కి మామిడి కాయలు కోశాడు.

చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టారు. వివరాల్లోకి వెళితే... వేసవి కావడంతో గాలి జనార్థన్ రెడ్డి తన మామ పరమేశ్వరరెడ్డి గారి ఊరైన కర్నూలు జిల్లా కాకనూరుకు భార్య సమేతంగా వెళ్లారు. తన మామకు చెందిన మామిడి తోటకు వెళ్లి కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు.

బాల్యంలో చెట్లు ఎక్కిన ఘటనలను గుర్తు చేసుకుని జ్ఙాపకాలను పంచుకున్నారు. అనంతరం స్వయంగా మామిడి చెట్టు ఎక్కారు. భార్యను కూడా చెట్టు ఎక్కించి సరదాగా గడిపారు.. అనంతరం మామిడి పండ్లను కోసి అందరికీ పంచి పెట్టారు. ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలోపెట్టడంతో ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?
Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu