అవినీతి ఆరోపణలు.. గెయిల్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్ అరెస్ట్..

By SumaBala BukkaFirst Published Jan 17, 2022, 11:13 AM IST
Highlights

ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్ ను ఇరువురు మధ్యవర్తులు ఎలా కలిశారు? లంచం ఎలా ఇచ్చారు? అన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది

న్యూ ఢిల్లీ : bribery తీసుకున్నాడన్న ఆరోపణల మీద GAIL మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ES Ranganathan సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించి రూ. 1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్ ను ఇరువురు మధ్యవర్తులు ఎలా కలిశారు? లంచం ఎలా ఇచ్చారు? అన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. 

సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ. 75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో రంగనాథన్, నాయర్ లతో పాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్ కు చెందిన సౌరబ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్ కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. 

ఇదిలా ఉండగా, Haryanaలో ఓ బీఎస్ఎఫ్ అధికారి వద్ద బయటపడిన ఆదాయానికి మించిన ఆస్తులు అందరన్నీ షాక్ కు గురిచేశాయి. NSGBSF ఆఫీసర్ గా పనిచేస్తున్న ఇతను ప్రజల్ని మోసం చేయడం ద్వారా ఈ Assets కూడబెట్టినట్టు సమాచారం. అతని వద్ద నుంచి రూ. 14 కోట్ల నగదు, కోటి రూపాయల విలువైన ఆభరణాలు, BMW, Jeep Mercedesతో సహా ఏడు లగ్జరీ కార్లు  స్వాధీనం చేసుకున్నారు. 

హర్యానాలోని సరిహద్దు భద్రతా దళ అధికారి వద్దనుంచి ఈ immense wealthను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి గుర్గావ్ జిల్లాలోని మనేసర్‌లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హెడ్‌క్వార్టర్స్ (NSG)లో BSF డిప్యూటీ కమాండెంట్ గా నియమించబడ్డాడు. అతని పేరు ప్రవీణ్ యాదవ్. కాగా తాను ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్‌ అని చెప్పుకుంటూ ప్రజలదగ్గరి నుంచి వివిధ పేర్లతో రూ.125 కోట్ల మోసం చేశాడు. ఇతడి మీద ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేయగా, సోదాల్లో ఈ ఆస్తులు బయటపడ్డాయి. 

ఇప్పుడు అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ బీఎస్ఎఫ్ అధికారి వద్దనుంచి రూ.14 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుర్గావ్ పోలీసులు అధికారి భార్య మమతా యాదవ్, సోదరి రీతూ, ఆమె సహచరుడిని కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి BMW, జీప్, మెర్సిడెస్‌తో సహా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.

NSG క్యాంపస్‌లో నిర్మాణ కాంట్రాక్టులు ఇప్పిస్తానని ఐపీఎస్ అధికారిగా నటిస్తూ, ప్రజల నుంచి కోట్లాది రూపాయలను యాదవ్ తీసుకున్నాడు. మోసం చేసిన మొత్తం డబ్బును అతడు ఎన్‌ఎస్‌జీ పేరుతో నకిలీ ఖాతాకు బదిలీ చేశాడు. యాక్సిస్ బ్యాంక్‌లో మేనేజర్‌గా ఉన్న అతని సోదరి రీతూ యాదవ్ ఈ ఖాతాలను తెరవడంలో సహాయం చేసినట్లు పోలీసులు తెలిపారు.

click me!