హాట్ హాట్‌గా సీడబ్ల్యూసీ మీటింగ్.. ముకుల్ వాస్నిక్‌కు పగ్గాలు ఇవ్వాలంటూ జీ 23 నేతల పట్టు

Siva Kodati |  
Published : Mar 13, 2022, 05:51 PM IST
హాట్ హాట్‌గా సీడబ్ల్యూసీ మీటింగ్.. ముకుల్ వాస్నిక్‌కు పగ్గాలు ఇవ్వాలంటూ జీ 23 నేతల పట్టు

సారాంశం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. ఈ సందర్భంగా సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని జీ 23 నేతలు అధిష్టానాన్ని కోరినట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం హాట్ హాట్‌గా జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు పూర్తి స్థాయి అధ్యక్షుడి ఎంపికపై చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. పార్టీలో పూర్తి స్థాయిలో  ప్రక్షాళన జరగాలని, జీ 23 అసమ్మతి నేతలు ఇప్పటికే హైకమాండ్‌ను డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను అధ్యక్షుడిగా నియమించాలని అసమ్మతి నేతలు సూచించినట్లు సమాచారం. 

గాంధీయేతర వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగించాల్సి వస్తే.. ప్రస్తుతం ముకుల్ వాస్నిక్‌కే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాత్రం రాహుల్‌కే బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. అలాగే జీ 23 నేతల డిమాండ్లు, పార్టీ సంస్థాగత ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులకు ఎవరికైనా పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా లేక ప్రస్తుత పరిస్ధితుల్లో బాధ్యతల నుంచి దూరంగా వుండకుండా రాహుల్‌కే పార్టీ పటిష్టత బాధ్యతలు ఇస్తారా అనేది ఈ సమావేశంలో చర్చించనున్నారు. 

కాగా.. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా ఆశించిన ఫలితాలు ఆ పార్టీకి దక్కలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత  అసమ్మతి నేతలు ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

2021 అక్టోబర్ మాసంలో CWC  సమావేశమైంది. సీడబ్ల్యుసీలో  పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పక్ష నేత సహా 23 మంది సభ్యులుంటారు. ఈ 23 మందిలో 12 మంది ఎఐసీసీ ద్వారా ఎన్నుకోబడిన 12 మంది సభ్యులుంటారు.  ఐదు రాష్ట్రాల Assembly ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 2017 ఎన్నికల్లో Punjab లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 80 సీట్లు దక్కించుకొంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. Uttarakhand, Goa, Manipurరాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ మెరుగైన సీట్లు దక్కించుకోలేదు.

ఈ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం విన్పిస్తున్న G-23 నేతలు సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ఎఐసీసీ కొత్త అధ్యక్షుడి ఎన్నికతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని కూడా అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ నెల 11వ తేదీన New Delhi లోని జీ 23కి నాయకత్వం వహిస్తున్న Ghulam Nabi Azad నివాసంలో కపిల్ సిబల్, మనీష్ తివారీ తదితరులు భేటీ అయ్యారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu