మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రవి పూజారి అరెస్ట్

By Siva KodatiFirst Published Feb 23, 2020, 9:24 PM IST
Highlights

భారత్‌లో అనేక దోపిడీలు, హత్యలు, బెదిరింపులు సహా అనేక నేరాలు చేసిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రవి పూజారిని దక్షిణాఫ్రికాలో అరెస్ట్ అయ్యాడు. 

భారత్‌లో అనేక దోపిడీలు, హత్యలు, బెదిరింపులు సహా అనేక నేరాలు చేసిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ రవి పూజారిని దక్షిణాఫ్రికాలో అరెస్ట్ అయ్యాడు.  దేశం విడిచి 15 ఏళ్ల క్రితం పారిపోయిన రవి పూజారీని కర్ణాటకకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులతో సహా అధికారుల బృందం భారత్‌కు తీసుకువచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎన్ఐఏ, సీబీఐ, రా విభాగాలు రవిని విచారించనున్నాయి. పూజారికి తొలుత గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌తో సంబంధం ఉంది. కానీ అతను అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం కూడా పనిచేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత వారిద్దరి నుంచి విడిపోయిన పూజారీ సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని హత్యలు, బెదిరింపులకు పాల్పడ్డాడు.

Also Read:గ్యాంగ్‌స్టర్ భజరంగీ హత్య: లావుగా ఉన్నాడని చంపా.. కాదు పథకం ప్రకారమే చంపాడు

అతని అరెస్ట్‌పై కర్ణాటక పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. బెంగళూరు నగరంలో రవిపై 39 కేసులు, మంగళూరులో 36, ఉడిపిలో 11, మైసూర్, హుబ్లీ, కోలార్, శివమొగ్గలో ఒక్కో కేసు అతనిపై నమోదైనట్లు తెలిపారు.

భారత్‌ నుంచి పారిపోయి సెనెగల్ చేరిన రవి పూజారి తన పేరును ఆంటోనీ ఫెర్నాండెజ్‌గా మార్చుకున్నాడు. అనంతరం పాస్‌పోర్ట్ సంపాదించి కుటుంబాన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేశాడు.

Also Read:ఢిల్లీలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌‌ల మధ్య ఎదురుకాల్పులు.. పరుగులు తీసిన జనాలు

గతేడాది 2019లో సెనెగల్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన అతను కనిపించకుండా పోయాడు. అనంతరం పోలీసులకు చిక్కగా.. భారత్‌కు అతనిని అప్పగించేందుకు సెనెగల్ సుప్రీంకోర్టు ఒప్పుకోవడంతో భారత పోలీసులు అక్కడికి వెళ్లారు. 

click me!