ఇంధ‌న ధ‌ర‌లు గ్లోబ‌ల్ రేట్ల ద్వారా కాదు.. ఎన్నికల తేదీల ఆధారంగా మారుతాయి - బీజేపీపై కాంగ్రెస్ మండిపాటు

By team teluguFirst Published Sep 12, 2022, 12:32 PM IST
Highlights

ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడటం లేదని, అవి ఎన్నికల తేదీలపై ఆధారపడి మారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ద్రవ్యోల్బణం, ఇంధన ధరల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు కనీసం రూ.15, వంటగ్యాస్‌పై సిలిండర్‌పై కనీసం రూ.150 త‌గ్గించి పేద‌, మధ్యతరగతి, దిగువ-ఆదాయ వర్గాల కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసింది. న్యూ ఢిల్లీలో కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముడి చమురు ధరలు ఏడు నెలల కనిష్ట స్థాయికి చేరుకుంద‌ని, అలాగే ద్రవ్యోల్బణం గత ఏడు నెలలుగా ఆర్‌బీఐ అప్ప‌ర్ బ్యాండ్ ఆరు శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అధిక ఇంధన ధరల భారాన్ని వినియోగదారులు ఎందుకు భరించాల్సి వస్తోంద‌ని ప్ర‌శ్నించారు.

పెళ్ల‌యిన త‌రువాత ఆ ఆట ఆడేందుకు అనుమ‌తిస్తేనే పెళ్లి.. పెళ్లి కూతురుతో పెళ్లికొడుకు స్నేహితుల డీల్‌! 

నిత్యం ముడిచమురు ధరల భారం ప్ర‌జ‌ల‌పై వేస్తున్న‌ప్పుడు, దాని ధ‌ర‌లు త‌గ్గిన‌ప్పుడు వినియోగ‌దారుల‌కు ఉప‌శ‌మ‌నం ఎందుకు అంద‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ‘‘ పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ ధరల ద్వారా మారడం లేదు. అవి ఎన్నికల తేదీలను బట్టి మారుతాయి ’’ అని గౌరవ్ వల్లభ్ విమ‌ర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ప్రభుత్వం ధరలను త‌గ్గిస్తోందని, కొన్ని సంద‌ర్భాల్లో పెర‌గ‌కుండా నియంత్రిస్తోంద‌ని అన్నారు. కానీ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే ధ‌ర‌లు పెంచుతున్నార‌ని ఆరోపించారు. 

‘‘ తగ్గుతున్న ఎల్పీజీ ధరల ఉప‌శ‌మ‌నాన్ని వినియోగదారులకు అందించేందుకు మోడీ ప్ర‌భుత్వం సాకులు ఎందుకు చెబుతోంది? మోడీ ప్ర‌భుత్వం వినియోగదారులపై భారం మోపడం మాత్రమే నమ్ముతోందా ’’ అని ఆయన ప్రశ్నించారు. రిటైల్ ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి, రూపాయి క్షీణించడం వంటి కొన్ని ఉదాహరణలు దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్వహిస్తున్నాయో చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దాని సొంత ప్రభుత్వం విడుదల చేసిన మరిన్ని డేటా పాయింట్లతో కొత్త అత్యల్పాలను సృష్టిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యత, అసమర్థత కారణంగా మధ్య, దిగువ-ఆదాయ వర్గాలు ఎక్కువగా నష్టపోతున్నాయి.’’ అని అన్నారు.

ఈ డాక్టర్ కి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ్ వల్లభ్ అన్నారు. ఇంధన ధరల విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘ గత కొన్ని నెలలుగా క్రూడాయిల్ ధరలు స్థిరంగా తగ్గుముఖం పట్టాయి. ఏడు నెలల కనిష్టానికి ఉన్నాయి. కానీ మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. గ్లోబల్ ధరల ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు మారాలి ’’ అని ఆయన అన్నారు. 

పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన డేటాను ప్రస్తావిస్తూ.. 2022 సెప్టెంబర్ 8 నాటికి ముడి చమురు భారతీయ బాస్కెట్ బ్యారెల్‌కు 88 యూఎస్ డాలర్లు ఉంద‌ని గౌర‌వ్ అన్నారు. దాని ధ‌ర ఈ ఏడాది జూన్ లో 116 యూఎస్ డాల‌ర్లు ఉంద‌ని చెప్పారు. 

Heavy rains: భారీ వ‌ర్షాలు.. ప‌లు రాష్ట్రాల్లో పోటెత్తిన వ‌ర‌ద‌లు

కాగా.. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల కంటే ముందు కొంత మేర పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు కొంత మేర‌కు త‌గ్గాయి. అయితే ఎన్నిలు ముగిసిన తర్వాత ఈ ఏడాది మార్చి 22 నుండి మార్చి 31 మధ్య 10 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు 9 సార్లు పెరిగాయి. 
 

click me!