Latest Videos

From the IAF Vault: భారత వైమానిక దళానికి చెందిన తొలి హెలికాప్టర్ సికోర్‌స్కై ఎస్-55 స్టోరీ ఇదీ

By Anchit GuptaFirst Published Aug 11, 2022, 3:29 PM IST
Highlights

సికోర్‌స్కై ఎస్-55 సుమారు దశాబ్ద కాలం వీఐపీ ప్రయాణాలకు, ఆపదలో ప్రాణ రక్షణకు, పౌర సేవలకు నిర్విరామంగా పని చేసింది. ఇప్పటికీ ఈ హెలికాప్టర్‌ ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో హుందాగా కనిపిస్తుంది. తొలి హెలికాప్టర్ గురించి ఐఏఎఫ్ చరిత్రకారులు అంచిత్ గుప్తా వివరిస్తున్నారు.
 

న్యూఢిల్లీ: భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత దేశ మిలిటరీని బలోపేతం చేయడానికి అప్పటి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మైరల్ మార్క్ పైజీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 1953లో ఆయన తొలి హెలికాప్టర్ కొనుగోలు కోసం ఆర్డర్ పెట్టారు. సికోర్‌స్కై ఎస్- 55 మూడు విమానాల కోసం ఆర్డర్ పెట్టారు. ‘గరుడ వ్యవస్థాపన’లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కాంట్రాక్టులో భాగంగా ఇద్దరు పైలట్లకు ట్రైనింగ్, ముగ్గురు ఇంజినీర్లకు శిక్షణ కూడా ఉన్నది. ఆ సమయంలో నేవీలో సరిపడా పైలట్లు, ఇంజినీర్లు కూడా లేరు.

ఆ కాలంలో సికోర్‌స్కైకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. శక్తిసామర్థ్యాలను ప్రూవ్ చేసుకుని హెలికాప్టర్ అది. వియత్నాం యుద్ధంలో ఈ హెలికాప్టర్ తన సత్తా చాటింది. ఈ కారణంగా సికోర్‌స్కై అప్పుడు చాలా దేశాలకు ఫేవరేట్ హెలికాప్టర్. నావల్ హెడ్‌క్వార్టర్ క్వాలిటీ, రిక్వైర్‌మెంట్‌ (ఆరు నుంచి ఏడుగురు ప్రయాణించడానికి, భూమి, సముద్రంలోనూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టడానికి, ఇతర ఫీచర్లు)లను శాటిస్ఫై చేసే హెలికాప్టర్ ఇది.

భారత వైమానిక దళానికి ఇదేమంతా ఆసక్తిగా లేనప్పటికీ 1953 అక్టోబర్‌లో మార్క్ పైజీ విజ్ఞప్తిని అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ గెరాల్డ్ ఎర్నెస్ట్ గిబ్స్ అంగీకరించారు. ఎస్-55 హెలికాప్టర్లను అంగీకరించారు. నావల్ పైలట్లు, ఇంజినీర్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి సమ్మతించారు. గరుడా స్థాపించిన తర్వాత వారిని తిరిగి నేవీలో ట్రాన్స్‌ఫర్ చేయడానికి అంగీకారం కుదిరింది.

ఎయిర్ మార్షల్ గిబ్స్ హామీని ఏడాది తర్వాత సుబ్రతో ముఖర్జీ నిజం చేశారు. ఇద్దరు నావల్ పైలట్లు కుట్టి మీనన్, వాధవాన్‌లకు శిక్షణ ఇచ్చి.. ఆరుగురు ఇంజినీర్లకూ ట్రైనింగ్ ఇచ్చి నావల్‌లోకి పంపారు.

మూడు ఎస్-55, రెండు ఎస్55సీ హెలికాప్టర్లను ఐఏఎఫ్ పొందింది. ఎస్-55సీ ఇందులో ఎక్కువ సామర్థ్యాలు కలది. 11,400 అడుగుల ఎత్తులో ఆపరేషన్లు చేయగలిగే కెపాసిటీ ఉన్నది. ఎస్-55 హెలికాప్టర్ సుమారు దశాబ్దం పాాటు వీఐపీలకోసం, ప్రకృతి వైపరిత్యాలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి, గాయపడిన పౌరులకు చికిత్స అందించడానికి ఎంతో ఉపకరించింది. అందుకే అప్పట్లో దీన్ని కష్టకాల మిత్రుడు అని పత్రికలు పొగిడేవి.

ఫ్లైయింగ్ ఆఫీసర్ ఎంఎస్ మిన్హి బవా ప్రయాణిస్తున్న విమానంలో ల్యాండింగ్‌లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులను రెస్క్యూ చేయడానికి తొలిసారి ఐఏఎఫ్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్‌కు ఎస్-55 శ్రీకారం చుట్టింది. హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేసే వరకు ఈ హెలికాప్టర్ ద్వారానే పైలట్లు సుశిక్షితులయ్యేవారు. 

1964లో కొచిన్‌లో జరిగిన ప్రమాదంలో ఐజెడ్648ను మనం కోల్పోయాం. మిగిలిన ఎస్-55 విమానాలు (ఐజెడ్ 649, ఐజెడ్ 650)లు మాత్రం చివరి వరకు సేవలు అందించాయి. ఐజెడ్ 1590 మాత్రం సేవలు అందించి నేటికి కూడా ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో భద్రంగా ఉన్నది.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

click me!