
కర్ణాటకకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు , సామాజిక కార్యకర్త హెచ్ ఎస్ దొరెస్వామి బుధవారం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 104 సంవత్సరాలు. కొద్దిరోజుల క్రితం కోవిడ్ బారినపడిన ఆయన .. నగరంలోని జయదేవ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు 104 ఏళ్ల వయసులోనూ కరోనాపై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దొరెస్వామి మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.