రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఆన్‌లైన్ లో ప్రసాదాన్ని పంపిస్తామంటూ అనేక వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. మీరు కూడా ఆన్‌లైన్‌లో రామాలయ ప్రసాదాన్ని ఆర్డర్ చేయాలని చూస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే....
అయోధ్య : రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఏదో రకంగా పాలు పంచుకోవాలని అందరిలోనూ ఎంతో ఉత్సాహం ఉంది. కానుకలు సమర్పించడమో.. ఆ రోజు దీపాలు వెలిగించడమో.. అయోధ్య అక్షతలు దేవుడి దగ్గర పెట్టుకోవడమో ఇలా ఏదో రకంగా అయోధ్య రామాలయ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తామూ వంతపాడాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది భక్తులు ఆన్‌లైన్‌లో ప్రసాదం కొనాలనుకుంటున్నారు.
దీనికోసం రకరకాల వెబ్‌సైట్‌లు చాలా ఉన్నాయి. మీరు కూడా ఆన్‌లైన్‌లో రామాలయ ప్రసాదాన్ని ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. రామమందిర్ నిర్మాణ్ ట్రస్ట్ దీనిమీద కీలక సమాచారం ఇచ్చింది. అయోధ్య రామాలయం ట్రస్టు... ఆన్ లైన్ లో ప్రసాదం పంపిణీ చేసే సౌకర్యాన్ని ఇంకా ప్రారంభించలేదని తెలిపింది. ఈ ప్రసాదం కేవలం ఆలయంలోనే ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు.
ఇదెలా వెలుగు చూసిందంటే..
ఓ భక్తుడు ఆలయ ట్రస్టును సంప్రదించగా ఈ విషయం వెల్లడైంది. ముంబైకి చెందిన అనిల్ పరాంజపే అనే వ్యక్తి ఆన్‌లైన్ ప్రసాదం గురించి బుధవారం రామ్ మందిర్ ట్రస్ట్‌ను సంప్రదించాడు. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు ఆన్‌లైన్‌లో ప్రసాదం అందిస్తున్నాయని అనిల్ కోరారు. అతను ప్రసాదం ఇవ్వడానికి ఆలయానికి వెళ్ళాడు, కాని అతని ప్రసాదాన్ని సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఆపారు. భద్రతా కారణాల దృష్ట్యా అతడిని ఆపారు. అయితే, రామమందిరం సమీపంలోని ట్రస్టు క్యాంపు కార్యాలయంలో ఉన్న సిబ్బంది 10 ప్యాకెట్ల యాలకులు అనిల్ కు ఇచ్చారు. ప్రసాదంలో యాలకులు కలిపి భక్తులకు పంచాలని సిబ్బంది ఆ వ్యక్తిని కోరారు.
ట్రస్ట్ క్యాంప్ ఇంచార్జ్ వివరణ..
ట్రస్ట్ క్యాంపు ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ రామమందిర్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ అని అన్నారు. రామ మందిరం ప్రాంగణంలో మాత్రమే ప్రసాదం లభిస్తుంది. ఈ ప్రసాదం కోసం భక్తుల నుంచి ఎలాంటి సొమ్ము తీసుకోవడం లేదు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్‌లో ప్రసాదం పంపిణీ చేయాలని ట్రస్టు ఇంకా ఎవరినీ ఆదేశించలేదన్నారు.
సోషల్ మీడియాలో వివిధ హ్యాండిల్స్ నుండి రామమందిర ప్రసాదం ఉచిత హోమ్ డెలివరీ అని చెబుతున్నాయి. అంతేకాకుండా భక్తుల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. KhadiOrganic.com అనే వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో ప్రసాద్ డెలివరీని ఉచితంగా అందజేస్తామని క్లెయిమ్ చేస్తోంది. కానీ రామ్ మందిర్ నిర్మాణ్ ట్రస్ట్ ఆన్‌లైన్ ప్రసాద్ డెలివరీని అనధికారమని పేర్కొంది.
App sabhi ram mandir ke prashad muft ma order kr skte ha khadi organic ke website se zarur kariyega pic.twitter.com/bge7ZaxiYH
— omdeep bosss (@BosssOmdeep)Free Ram Mandir Prashad Scam pic.twitter.com/O9F4JDdsjf
— Omprakash singh (@Omprakashhacker)