మధ్యప్రదేశ్‌లో సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్న ఓ యువకుడు కోచింగ్ సెంటర్‌లో క్లాసు వింటూనే కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి అభ్యర్థులు సమీప హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, అప్పటికే రాజు లోధి మరణించినట్టు వైద్యులు తెలిపారు.
Viral: ఈ మధ్య కాలంలో సైలెంట్ హార్ట్ ఎటాక్ ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. మనిషి చూస్తుండగానే కుప్పకూలిపోయి క్షణాల్లోనే ప్రాణాలు విడిచిపెడుతున్నారు. చుట్టుపక్కల వారు నిస్సహాయులను చేస్తున్న ఈ ఘటనలు అందరిలోనూ కలవరం పుట్టిస్తున్నాయి. ఇలాంటి ఓ ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు కోచింగ్ క్లాస్‌లో పాఠాలు వింటూనే కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. వెంటనే సమీప హాస్పిటల్ తరలించారు. కానీ, అప్పటికే ఆ విద్యార్థి మరణించినట్టు వైద్యులు నిర్దారించారు.
సాగర్ జిల్లాకు చెందిన రాజా లోధి మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇండోర్‌లో కోచింగ్ క్లాసులకు వెళ్లుతున్నాడు. క్లాసు శ్రద్ధగా వింటున్నాడు. ఇంతలో చెస్ట్ పెయిన్ వచ్చింది. ఈ నొప్పితో గింజుకుంటూనే కుప్పకూలిపోయాడు. డెస్క్ పై నుంచి క్షణాల్లోనే కిందపడిపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది.
Tragic news from
MPPSC aspirant dies from fatal heart attack during coaching class. CCTV footage from classroom shows Raja Lodhi sitting upright focused... Suddenly begins clutching his chest, expressing visible distress. Loses balance within seconds & falls off. Hospital… pic.twitter.com/Xf3ni3fitC
Also Read : NTR: వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా.. : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంపై కొడాలి నాని
రాజు లోధితో కలిసి చదువుకుంటున్న ఆయన మిత్రుడు మాట్లాడుతూ.. లోధికి నొప్పి వస్తున్నదని ఇబ్బంది పడ్డాడని వివరించారు. అయితే, ఆ తర్వాత నొప్పి తీవ్రత పెరిగింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన విద్యార్థులు వెంటనే రాజు లోధిని సమీప హాస్పిటల్ తరలించారు. కానీ, అప్పటికే రాజు లోధి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతున్నది.