ప‌నిచేసే మ‌హిళ‌లు, బ‌డి పిల్లల‌కు ఏప్రిల్ 1 నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం..

Published : Feb 21, 2023, 07:30 PM IST
ప‌నిచేసే మ‌హిళ‌లు, బ‌డి పిల్లల‌కు ఏప్రిల్ 1 నుంచి ఉచిత బ‌స్సు ప్ర‌యాణం..

సారాంశం

Bengaluru: పనిచేసే మహిళలు, పాఠశాల పిల్లలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం నాడు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప్ర‌క‌ట‌న రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం రేపుతోంది.   

Free bus rides in Karnataka: క‌ర్నాట‌క అసెంబ్లీ త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ ప్రాణాళిక‌లు ఇప్ప‌టినుంచే అమ‌లు చేస్తోంది. దీనిలో భాగంగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉచిత బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పిస్తున్న‌ట్టు క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. పనిచేసే మహిళలు, పాఠశాల పిల్లలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం నాడు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప్ర‌క‌ట‌న రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం రేపుతోంది. 

వివ‌రాల్లోకెళ్తే.. పనిచేసే మహిళలు, పాఠశాల పిల్లలకు ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు  కర్నాట‌క ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం నాడు తెలిపారు. ఎన్నికలకు ముందు కేఎస్ఆర్టీసీకి చెందిన వోల్వో మల్టీ అక్సెల్ బిఎస్ 4-9600 స్లీపర్ బస్సులను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బొమ్మై మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు స్వయం సమృద్ధి సాధించడమే ఈ పథకాన్ని రూపొందించడం ముఖ్య ఉద్దేశమని చెప్పారు.మినీ స్కూల్ బస్సులను ప్రవేశపెట్టాలనీ, ప్రస్తుతం ఉన్న బస్సులను వినియోగించి కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. పాఠశాలలు ప్రారంభించే సమయంలో ప్రతి తాలూకాలో కనీసం ఐదు బస్సులు నడపాలి. అవసరమైతే మరిన్ని గ్రాంట్లు విడుదల చేస్తామని ఆయ‌న తెలిపారు.

 

 

ఆర్థికాభివృద్ధిలో రవాణా కీలక పాత్ర పోషిస్తుందనీ, అందుకే దీనికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో పనిచేసే మహిళలు, పాఠశాల విద్యార్థులకు ఉచిత పాస్ సదుపాయాన్ని ప్రకటించామని తెలిపారు. పనిచేసే సిబ్బందికి, యాజమాన్యానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రయాణికులకు మంచి సేవలు అందిస్తామని చెప్పారు. స్లీపర్ సదుపాయం ఉన్న 'అంబారీ' అనే ప్రత్యేక రవాణా బృందాన్ని రాష్ట్రానికి అంకితం చేసినట్లు సీఎం తెలిపారు. రైల్వే స్లీపర్ కోచ్ ల మాదిరిగానే ఈ బస్సుల్లో అనేక మంచి ఫీచర్లను అందించామ‌ని తెలిపారు. 

గతంలో వోల్వో బస్సులు సౌకర్యవంతంగా లేవని, దీన్ని అర్థం చేసుకుని ప్రయాణికులకు మంచి సౌకర్యాలు కల్పించేందుకు మల్టీ ఆక్సెల్ బస్సులను రూపొందించామన్నారు. ఇకపై ఈ బస్సుల్లో రాత్రి ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర రవాణా సంస్థ మరికొన్ని బస్సులను కొనుగోలు చేయాల‌ని బ‌స‌వ‌రాజ్ బొమ్మై సూచించారు. అంత‌కుముందు, అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని, లోకాయుక్తను ఆ పార్టీ బలహీనపరిచిందని, కేసులను ఏసీబీకి అప్పగించి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని కాంగ్రెస్ పై  బొమ్మై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ మంత్రులకు, అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించిన అనేక కేసులు ఉన్నాయని ఆయన అన్నారు. అన్ని కేసులను లోకాయుక్తకు అప్పగిస్తాం. ఎవరు జైలుకు వెళ్తారో చూస్తామన్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?