
BJP protest against Congress leader Pawan Khera: ప్రధాని నరేంద్ర మోడీని అవమానించేలా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ బీజేపీ ఢిల్లీ విభాగం మంగళవారం సెంట్రల్ ఢిల్లీలో నిరసన చేపట్టింది. ఆయనను కాంగ్రెస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
వివరాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన వ్యాఖ్యలతో అమానించారంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయన కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు ఈ నిరసనలు చేపట్టారు. నిరసనలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలు పవన్ ఖేరాను పార్టీ నుండి తొలగించాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తూ బ్యానర్లను పట్టుకున్నారు.
తమ డిమాండ్ ను వినిపించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ నివాసానికి ర్యాలీగా వెళ్లాలని బీజేపీ ఢిల్లీ విభాగం నిర్ణయించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ (Narendra Damodardas Modi) అని విమర్శించారు. ప్రధాని మోడీ తండ్రి పేరు దామోదర్ దాస్ ముల్ చంద్ మోడీ (Damodardas Mulchand Modi). నరసింహారావు జేపీసీని ఏర్పాటు చేయగలిగితే, అటల్ బిహారీ వాజ్ పేయి జేపీసీని ఏర్పాటు చేయగలిగితే, నరేంద్ర గౌతమ్ దాస్ - క్షమించండి, దామోదర్ దాస్ - మోడీకి ఏ సమస్య ఉంది?" అని ఖేరా విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.
ప్రధాని మోడీ పేరును ప్రస్తావించిన తరువాత, ఖేరా తన సహచరులను అడుగుతూ.. ప్రధాని మోడీ మధ్య పేరు గౌతమ్ దాస్ లేదా దామోదర్ దాస్ అని స్పష్టం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'నామ్ దామోదర్ దాస్ హై, కామ్ గౌతమ్ దాస్ కా హై. (అతని పేరు దామోదర్దాస్, అతని పని గౌతమ్ దాస్ది). అని అన్నారు. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, మోసాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత గౌతమ్ అదానీ, స్టాక్ మార్కెట్లో తన షేర్లను స్వేచ్ఛగా వదులుకోవడంపై మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు.
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడమే కాకుండా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రకటన రాహుల్ గాంధీ స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సైతం ఖేరాపై విరుచుకుపడ్డారు. ప్రధానిపై కాంగ్రెస్ ఇలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదని అన్నారు.