ముంబైలో కూలిన నాలుగంతస్తుల భవనం: ఇద్దరు మృతి

Published : Jul 16, 2019, 12:33 PM ISTUpdated : Jul 16, 2019, 01:53 PM IST
ముంబైలో కూలిన నాలుగంతస్తుల భవనం: ఇద్దరు మృతి

సారాంశం

ముంబైలో నాలుగంతస్తుల భవనం మంగళవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో  ఇద్దరు మృతి.చెందగా, మరో 40 మందికి పైగా శిథిలాల కింద పలువురు చిక్కుకొన్నారు.ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ముంబై: ముంబైలో నాలుగంతస్తుల భవనం మంగళవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో  ఇద్దరు మృతి.చెందగా, మరో 40 మందికి పైగా శిథిలాల కింద పలువురు చిక్కుకొన్నారు.ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు..ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాధితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ భవనం కింద పలువురు చిక్కుకొన్నట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు.విషయం తెలిసిన వెంటనే పలు శాఖల అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.  మంగళవారం ఉదయం 11:40 గంటలకు ఈ భవనం కుప్పకూలినట్టుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. 

ముంబై డోంగ్రిలోని అబ్దుల్ రహమాన్ షా  దర్గా సమీపంలో ఈ భవనం ఉన్నట్టుగా  పోలీసులు చెబుతున్నారు.  శిథిలాల కింద సుమారు 50 మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

శనివారం ఏం జరగనుంది.? లాక్‌డౌన్‌ త‌ర‌హా నిబంధ‌న‌లు ఎందుకు విధించారు.?
Indian Railways: రైళ్లలో పిల్లలకు 50 శాతం టికెట్ ఛార్జీ తగ్గింపు.. ఏ వయసు వరకు ఇస్తారో తెలుసా?