ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘటన

By Asianet News  |  First Published Sep 22, 2023, 8:00 AM IST

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ కుటుంబం మొత్తం గురువారం ఉదయం విగతజీవులుగా కనిపించారు. ఆ ఇంట్లో ఉన్న నలుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉజ్జయినిలోని శిజివాజిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఈ కుటుంబం అంతా గురువారం ఉదయం విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మల దుకాణం నడిపే మోహన్‌ జానకి నగర్‌లోని ఇంట్లో తన భార్య మమత, పిల్లలు లక్కీ, కనక్ తో కలిసి జీవిస్తున్నాడు. అయితే గురువారం ఉదయం ఆ ఇంటి నుంచి ఎలాంటి శబ్దాలు వినిపించలేదు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంటి దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టి పిలిచారు. కానీ లోపలి నుంచి ఎలాంటి చప్పుడూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. 

Latest Videos

పోలీసులు అక్కడికి చేరుకొని ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అయితే మోహన్, భార్య, పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. దీంతో వారి డెడ్ బాడీలను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మనోజ్ మొదట ముగ్గురు కుటుంబ సభ్యులకు విషమిచ్చి, తరువాత ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనను ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం విచారిస్తోందని ఎస్పీ తెలిపారు. 

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

click me!