ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసులు మృతి..

Published : Dec 01, 2022, 05:32 PM ISTUpdated : Dec 01, 2022, 05:38 PM IST
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసులు మృతి..

సారాంశం

ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌‌కు చెందినవారిగా  గుర్తించారు. 

ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌‌కు చెందినవారిగా  గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివరాలు.. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి పూరీ వైపు వెళ్తుండగా.. బడాపోఖరి ప్రాంతంలో జాతీయ రహదారి 16పై రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.  ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. 

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో విశాఖకు చెందిన బ్యూటీషియన్ మారియా ఖాన్(24), ఆర్టిస్టులు కబీర్, లక్ష్మీ, ఫోటోగ్రాఫర్ రాఖీ ఉన్నారు. వీరు భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి