స్కూల్ బ్యాగుల్లో కండోమ్‌లు, సిగరెట్లు, లైటర్లు.. నివ్వెరపోయిన టీచర్లు.. షాక్‌లో పేరెంట్స్

By Mahesh KFirst Published Dec 1, 2022, 4:57 PM IST
Highlights

బెంగళూరు నగరంలో స్కూల్ పిల్లల బ్యాగులు తనిఖీలు చేయగా విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల దగ్గర కండోమ్‌లు, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ (గర్భం దాల్చకుండా నిరోధించే మాత్రలు), సిగరెట్లు, లైటర్లు లభించాయి.
 

బెంగళూరు: పాఠశాలలకు వెళ్లుతున్న విద్యార్థులు క్లాసురూమ్‌లలోకి ఫోన్‌లు తీసుకెళ్లుతున్నారని ఫిర్యాదులు రావడంతో నగరంలోని చాలా స్కూల్ యాజమాన్యాలు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సడెన్ చెకింగ్‌లో టీచర్లు, ఇతర స్టాఫ్ విస్తూపోయే వస్తువులు దొరికాయి. ఫోన్‌లు దొరకడం కంటే కూడా వాటితోపాటు దొరికిన కండోమ్‌లు, ఓరల్ కాంట్రసెప్టివ్‌లు, సిగరెట్లు, లైటర్లు, వైట్‌నర్లు లభించడం వారిని ఆందోళనలోకి నెట్టేశాయి. ఈ విషయాన్ని పేరెంట్స్‌కు తెలియజేశారు. పేరెంట్స్‌ కూడా ఈ విషయం విని ఖంగుతిన్నారు. కొన్ని రోజులుగా తమ పిల్లలు కూడా అసాధారణంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు.

క్లాసు రూముల్లోకి సెల్‌ఫోన్లు తీసుకువస్తున్నారని, పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టడానికి ముందు సాధారణ తనిఖీలు చేద్దామని అనుకున్నారు. అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ ఇన్ కర్ణాటకకు ఈ విజ్ఞప్తులు రావడంతో ఈ తనిఖీలు చేశారు.

పాఠశాలల్లో మద్యం తాగడం, వొడ్కా షాట్స్ తీసుకోవడం సాధారణ విషయంగా మారిపోయిందని అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ స్కూల్స్ ఇన్ కర్ణాటక జనరల్ సెక్రెటరీ డీ శశికుమార్ తెలిపారు. అయితే, ఈ ఆందోళనకర వస్తువులు దొరకడమే తమలో కలవరం పెంచిందని వివరించారు. 

Also Read: కండోమ్ లు కూడా కావాలా?.. శానిటరీ పాడ్స్ గురించి అడిగిన బాలికలతో మహిళా ఐఏఎస్ దురుసు ప్రవర్తన..

ఈ తనిఖీల తర్వాత పేరెంట్స్‌తో స్కూల్ సిబ్బంది సమావేశం అయ్యారు. స్కూల్స్‌లోనే కౌన్సెలింగ్ సదుపాయం ఉన్నప్పటికీ బయట వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని పేరెంట్స్‌కు సిబ్బంది సూచనలు చేశారు. ఇందుకోసం విద్యార్థులకు పది రోజులపాటు సెలవులు మంజూరు చేశారు.

8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థుల బ్యాగులు తనిఖీలు చేయగా ఇవి బయటపడ్డాయి. కండోమ్‌లు లభించిన ఓ పదో తరగతి బాలికను దాని గురించి ఆరా తీయగా తోటి మిత్రులను బ్లేమ్ చేసింది. ఇంకొందరు తమకు టైట్ షెడ్యూల్ ఉంటున్నదని, అందుకే మధ్యలో కొంత ఫన్ కోసం ఇవి మెయింటెయిన్ చేస్తున్నామని జవాబు ఇచ్చినట్టు బెంగళూరు మిర్రర్ న్యూస్ సైట్ రిపోర్ట్ చేసింది. కేఏఎంఎస్ సూచన మేరకు ఈ రోటీన్ చెకప్ చేయడంతో విస్మయకర విషయాలు వెలుగు చూశాయి. కొందరేమో ఇది టిప్ ఆఫ్ ఐస్ బర్గ్ మాత్రమే అని అంటున్నారు.

click me!