భారీ హోర్డింగ్ కుప్పకూలి నలుగురు దుర్మరణం....

By Arun Kumar PFirst Published Oct 6, 2018, 10:50 AM IST
Highlights

మహారాష్ట్ర లోని పూణేలో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి నలుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా మరో 9 మంది  తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చాలా వాహనాలు ద్వంసమయ్యాయి. 
 

మహారాష్ట్ర లోని పూణేలో ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి నలుగురు ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. అంతేకాకుండా మరో 9 మంది  తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చాలా వాహనాలు ద్వంసమయ్యాయి. 

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం పుణే రైల్వే స్టేషన్ వద్దగల షేక్ చౌక్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ భారీ హోర్డింగ్ ను తొలగించే పనులు చేపట్టారు. అయితే ఈ క్రమంలో ప్రమాదవశాత్తు హోర్డింగ్ ఒక్కసారిగా రోడ్డుపై వున్న వాహనాలపై  కుప్పకూలింది. దీంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శివాజీ పరదేశీ  (40), కసర్, షామ్ రావ్ దోట్రే, జావేద్ ఖాన్ లుగా గుర్తించారు.  మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో వామనాలు ద్వంసమయ్యాయి. 

ఈ ప్రమాదంలో పరదేశీ అనే వ్యక్తి చనిపోగా అతడి కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు రోజుల క్రితమే శివాజీ పరదేశి భార్య చనిపోయింది. దీంతో ఆమె అస్థికలు నదిలో కలిసి ఆటోలో ఇంటికి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురై ఇతడు కూడా చనిపోయాడు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు భార్యాభర్తలు మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నిండింది. 

మద్యాహ్నం సమయంలో ట్రాఫిక్ అంతగా ఉండదు కాబట్టి ఈ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకుండానే ఈ పనులు చేపట్టడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటపై విచారణకు ఆదుశించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు 5లక్షల పరిహారం అందించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అంతేకాకుండా తీవ్ర గాయాలపాలైన వారికి చికిత్స నిమిత్తం లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50వేల పరిహరం అందించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 
  

click me!