మత్తు మందు ఇచ్చి డెంటిస్ట్ పై అత్యాచారం

Published : Oct 06, 2018, 08:56 AM IST
మత్తు మందు ఇచ్చి డెంటిస్ట్ పై అత్యాచారం

సారాంశం

మహిళ ఇంటికి వెళ్లిన నింధితుడు, బలవంతంగా ఆమెకు మత్తు మందు తాగించాడు. ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నింధితుడిని ముజఫర్ నగర్‌కు చెందిన అభిమన్యు (25)గా పోలీసులు గుర్తించారు.

న్యూఢిల్లీ: నోయిడాలో ఓ దారుణమైన సంఘటన జరిగింది. నోయిడాలోని 37వ సెక్టార్‌లో అద్దెకు ఉంటున్న ఓ డెంటిస్ట్ (24)కు ఓ వ్యక్తి మత్తు మందు తాగించి ఆమెపై అత్యాచారం చేశాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఆ సంఘటన చోటు చేసుకుంది.

మహిళ ఇంటికి వెళ్లిన నింధితుడు, బలవంతంగా ఆమెకు మత్తు మందు తాగించాడు. ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నింధితుడిని ముజఫర్ నగర్‌కు చెందిన అభిమన్యు (25)గా పోలీసులు గుర్తించారు.
 
నిందితుడితో రెండు నెలలుగా ఫేస్‌బుక్‌లో పరిచయం ఉందని, ఇటీవల పరస్పరం ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నామని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది. ఒకసారి అభిమన్యూను కలిసినట్టు కూడా చెప్పింది. అయితే బాధితురాలికి ఫోన్ చేసి తన ఫ్లాట్‌కు వస్తానని నింధితుడు అడిగాడు. 

తొలుత డెంటిస్ట్ అంగీకరించలేదు. అయితే అభిమన్యు బలవంత పెట్టడంతో చివరికి సరేనంది. ఫ్లాట్‌కు వచ్చిన నింధితుడు బలవంతంగా మత్తు మందు తాగించి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial