ఛత్తీస్‌‌గఢ్: రాయ్‌‌‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పేలుడు.. నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు

By Siva KodatiFirst Published Oct 16, 2021, 5:19 PM IST
Highlights

ఛత్తీస్‌గఢ్ (chhattisgarh) రాజధాని రాయ్‌పూర్ (raipur railway station) రైల్వేస్టేషన్‌లో శనివారం స్వల్ప పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ (crpf) జవాన్లకు గాయాలయ్యాయి. 

ఛత్తీస్‌గఢ్ (chhattisgarh) రాజధాని రాయ్‌పూర్ (raipur railway station) రైల్వేస్టేషన్‌లో శనివారం స్వల్ప పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ (crpf) జవాన్లకు గాయాలయ్యాయి. డిటోనేటర్లు, హెచ్‌డీ కాట్రిడ్జ్ వంటి మందుగుండు సామగ్రితో కూడిన కంటైనర్‌ను రైలులోకి ఎక్కిస్తుండగా ప్రమాదవశాత్తూ అవి కిందపడటంతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు స్టేషన్‌లో నిలిపివ ఉండటంతో జవాన్లకు గాయాలయ్యాయి.  

కాగా.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు ఒడిశా (odisha) లోని ఝర్సుగూడ (jharsuguda) నుంచి జమ్ముకు (jammu) వెళ్తోంది. ఉదయం ఆరున్నర సమయంలో రాయ్‌పూర్‌ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ వద్ద రైలు నిలిపి ఉంచిన సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడ్డ నలుగురు జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఒక్కసారిగా భారీ శబ్థంలో పేలుడు సంభవించడంతో రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. తర్వాత విషయం తెలుసుకుని ఊపిరీ పీల్చుకున్నారు. 

Also Read:దుర్గా మాత నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు

మరోవైపు నిన్న ఛత్తీస్‌గడ్‌లో దుర్గా మాత నిమజ్జనానికి వెళ్తున్న భక్తులపైకి వెనుక నుంచి వచ్చిన ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. జష్‌పూర్ జిల్లా పథల్‌గావ్ నివాసి గౌరవ్ అగర్వాల్‌తోపాటు మరో ముగ్గురు మృతి చెందిన వారిలో వున్నారు. కాగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పథల్‌గావ్ సివిల్ హాస్పిటల్‌లో చికిత్సకు తరలించారు. తీవ్రంగా గాయపడి, ఎముకలు విరిగిన ఇద్దరు పేషెంట్లను మరో హాస్పిటల్‌కు తరలించినట్టు బ్లాక్ మెడికల్ అధికారి జేమ్స్ మింజ్ వివరించారు.

మధ్యప్రదేశ్‌‌ పేరటి నంబర్ ప్లేట్ ఉన్న మహీంద్రా జైలో కారు సుఖ్రాపారావైపు వెళ్తూ భక్తులను ఢీకొట్టింది. అక్కడే ఉన్న ఇతర భక్తులు ఆగ్రహంతో కారు వెంట పరుగులు తీశారు. కొద్ది దూరంలో ఆ కారును రోడ్డు పక్కన ఉన్నట్టు గమనించారు. అక్కడికి చేరగా డ్రైవర్ వైపు డోర్ తీసే ఉన్నది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి.
 


 

click me!