సత్తా చూపిన భారత ఆర్మీ... ‘మిలిటరీ పెట్రోలింగ్ ఒలిపింక్స్‌’లో ఇండియన్ ఆర్మీ టీమ్‌కు గోల్డ్ మెడల్

By telugu team  |  First Published Oct 16, 2021, 4:58 PM IST

ప్రపంచదేశాలకు భారత ఆర్మీ తన సత్తా చూపింది. ప్రపంచదేశాల నుంచి వచ్చిన మొత్తం 96 టీమ్‌లలో ఇండియన్ ఆర్మీ టీమ్ ఎక్సర్‌సైజ్ కెంబ్రియన్ ప్యాట్రోల్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ ఎక్సర్‌సైజ్ యూకేలో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించారు.
 


న్యూఢిల్లీ: భారత సైన్యం మరో ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా ప్రపంచదేశాల పటిష్టమైన సైన్యాల జట్టులు పాల్గొనే ఎక్సర్‌సైజ్ కెంబ్రియన్ ప్యాట్రోల్‌లో భారత ఆర్మీ జట్టు Gold Medal సంపాదించింది. ఎక్స‌ర్‌సైజ్ కెంబ్రియన్ ప్యాట్రోల్‌ను చాలా మంది ఒలింపిక్స్ ఆఫ్ మిలిటరీ పెట్రోలింగ్‌గా వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఈ పెట్రోలింగ్‌లో అంతటి కఠినమైన పరీక్షలు పెడుతుంటారు.

ఈ కెంబ్రియన్ ప్యాట్రోల్ ఎక్సర్‌సైజ్‌ను UKకు చెందిన వేల్స్‌లోని బ్రెకాన్‌లో నిర్వహించారు.  ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వీటిని నిర్వహించారు. ఇందులో Indian Army తరఫున గోర్ఖా రైఫిల్స్(ఫ్రాంటియర్ ఫోర్స్) టీమ్ పాల్గొంది.

Latest Videos

ఇందులో ఒక మనిషి వాతావరణ సమస్యలను, ఇతర అడ్డకుంటను తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షించడమే కీలకంగా ఉంటుంది. ఎగుడు దిగుడులుగా ఉండే భూమి, కఠిన ఉష్ణోగ్రతలు, వాతావరణం, ఇతర భౌతిక సవాళ్లలో ఆర్మీ బృందాల ప్రదర్శనలను అంచనా వేస్తారు. నిజజీవితంలో ఉండే సమస్యలకంటే కఠినమైన పరిస్థితుల్లో వారిని ఉంచుతారు. అలాంటి సందర్భంలో వారు ఎలా యుద్ధానికి సిద్ధమవుతున్నారనే విషయాలను పరిశీలిస్తారు.

ఈ Cambrian Patril Exerciseలో భారత ఆర్మీ విమర్శకుల ప్రశంసలు పొందింది. న్యాయనిర్ణేతలూ కొనియాడారు. ముఖ్యంగా నావిగేషన్ నైపుణ్యాలు, ప్యాట్రోల్ ఆదేశాలను బట్వాడా చేయడంతోపాటు భౌతిక పటిష్టత అంశాలకు సంబంధించి భారత ఆర్మీ టీమ్‌ను జడ్జీలు కితాబిచ్చారు.

Also Read: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు మిస్సింగ్.. భారీ కూంబింగ్ చేపడుతున్న ఆర్మీ

ఈ ఎక్స‌ర్‌సైజ్‌లో 96 టీమ్‌లు పాల్గొన్నాయి. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన స్పెషల్ ఫోర్సెస్, ప్రముఖ రెజిమెంట్లకు చెందిన 17 అంతర్జాతీయ టీమ్‌లు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై పోటీ పడి భారత ఆర్మీ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

ఈ నెల 15న అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటీష్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ సర్ మార్క్ కార్ల్‌టన్-స్మిత్ గోల్డ్ మెడల్‌ను ఇండియన్ ఆర్మీ టీమ్‌కు అందించారు. ఈ ఏడాది మొత్తం 96 టీమ్‌లలో ఎక్సర్‌సైజ్ 6వ దశ వరకు కేవలం మూడు అంతర్జాతీయ ప్యాట్రోల్స్ మాత్రమే గోల్డ్ మెడల్ పొందాయి.

click me!