
మధ్యప్రదేశ్‌లోని కట్నీ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి సిమెంట్‌తో కూడిన గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన నాలుగు బోగీలు పక్కకు ఒరిగాయి . దీంతో పట్టాల పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ మార్గంలో అదనపు లైన్ ఉండడంతో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం పడలేదు. పట్టాలు తప్పిన వెంటనే ట్రాక్‌ను క్లియర్ చేసే పనిని వెంటనే ప్రారంభించారు.
ఘటనా విషయం తెలుసుకున్న రైల్వే డీఆర్‌ఎం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రైలు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి సిమెంట్‌ను తీసుకెళ్తుందనీ, లైన్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మార్గంగుండా రైలును అధికారులు రద్దు చేశారు. ట్రాక్ పునరుద్ధరణకు 36 గంటలు పట్టే అవకాశమున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అంతకుముందు.. పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లోని శక్తిగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి బర్ధమాన్-బండెల్ లోకల్ రైలు పట్టాలు తప్పింది. రాత్రి 9.20 గంటల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.