
మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) రాజీనామా చేయకుంటే, ఆయనను తిరిగి నియమించేవారని గురువారం సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పుపై ఉద్ధవ్ థాకరే స్పందిస్తూ.. తన పోరాటం ముఖ్యమంత్రి పదవి కోసం కాదని అన్నారు. "నా రాజీనామా పొరపాటు కావచ్చు. కానీ, నేను అలాంటివి చూడటం లేదు. నేను ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, నా తండ్రి బాలాసాహెబ్ ఠాక్రేను అనుసరించే ప్రజల కోసం పోరాడుతున్నాను. ఆ మేరకే రాజీనామా చేశాను." అని ఉద్ధవ్ మీడియాతో సంయుక్త విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ కార్యక్రమానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు.
ఉద్ధవ్ థాకరే ఇంకా మాట్లాడుతూ.. "నేను నైతిక ప్రాతిపదికన రాజీనామా చేశాను. పార్టీ ఇచ్చినవన్నీ ద్రోహులుగా మార్చారు. మెజారిటీ నిరూపించమని నన్ను అడిగారు. నేను అందులో పాల్గొనడానికి ఇష్టపడలేదు" అని థాకరే బలపరీక్షకు ముందు తన రాజీనామా చేయడాన్ని సమర్థించుకున్నారు. తాను నైతిక వైఖరి తీసుకున్నట్లుగా.. వారు (షిండే, ఫడ్నవీస్) ఇప్పుడు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు ఉద్ధవ్ ఠాక్. తాను రాజీనామా చేయగా పోతే.. తనను ముఖ్యమంత్రిగా పునఃప్రతిష్ఠించి ఉండేవారమని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కానీ తాను పోరాటం తన కోసం కాదనీ, దేశం కోసం, తన రాష్ట్రం కోసం, ప్రజాస్వామ్య విలువ పరిరక్షణ కోసమనీ, అందుకే పోరాడుతున్నానని చెప్పారు.
ఉద్ధవ్ వర్సెస్ షిండే కేసుపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు రెండు వర్గాలకు ఏదో ఓ విధంగా సంతోషకరంగా ఉంది. షిండే గ్రూపులో చేరిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయలేదని, అసలు శివసేన ఎవరో స్పీకర్ నిర్ణయిస్తారని పేర్కొంది. విల్లు, బాణం గుర్తు ఉన్న షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తించింది.
అప్పటి గవర్నర్ బీఎస్ కోశ్యారు ఆదేశించిన బలపరీక్ష చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉద్ధవ్ ప్రభుత్వం పతనానికి ఫ్లోర్ టెస్ట్ ఆర్డర్ కారణమనీ, ఈ తీర్పు అధికారంలో ఉన్న షిండే ప్రభుత్వానికి చెంపదెబ్బగా వ్యాఖ్యానించింది. బలపరీక్షకు ముందే ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందున ఆయనను తిరిగి నియమించలేమని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 2022 జూన్‌లో శివసేన పార్టీ చీలిపోయిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.