సచిన్ వాజే ఇంట్లో 62 బుల్లెట్లు, నగదు స్వాధీనం

By narsimha lodeFirst Published Mar 25, 2021, 5:09 PM IST
Highlights

ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో ఉన్న కారు కేసులో అరెస్టైన సస్పెన్షన్ కు గురైన పోలీస్ అధికారి సచిన్ వాజే ఇంట్లో మందుగుండు సామాగ్రి, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకొన్నట్టుగా ఎన్ఐఏ ప్రకటించింది.

ముంబై: ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో ఉన్న కారు కేసులో అరెస్టైన సస్పెన్షన్ కు గురైన పోలీస్ అధికారి సచిన్ వాజే ఇంట్లో మందుగుండు సామాగ్రి, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకొన్నట్టుగా ఎన్ఐఏ ప్రకటించింది.

నిందితుల నుండి ఇంకా సమాచారాన్ని సేకరించేందుకు కస్టడీని కోరుతున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.సచిన్ వాజే నివాసం నుండి 62 బుల్లెట్లను స్వాధీనం చేసుకొన్నట్టుగా  ఎన్ఐఏ తెలిపింది.సచిన్ వాజే సర్వీస్ రివాల్వర్ కోసం ఇచ్చిన 30 బుల్లెట్లలో 5 మాత్రమే లభించాయి. మిగిలినవి ఎక్కడికి వెళ్లాయనే విషయమై  సమాచారాన్ని వాజే నుండి రాబట్టాల్సి ఉందని ఎన్ఐఏ ప్రకటించింది.

ముఖేష్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్ధాలు నింపిన వాహన యజమాని ముఖేష్ హిరాన్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.హిరాన్ ను సచిన్ వాజేలు ఫిబ్రవరి 17న  కలిసినట్టుగా ఆధారాలను సంపాదించినట్టుగా ఎన్ఐఏ తెలిపింది. హిరాన్ మరణానికి వాజే ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. హిరాన్ డెడ్ బాడీగా కన్పించడానికి కొన్ని రోజుల ముందు ఆయన తప్పిపోయినట్టుగా ఫిర్యాదు అందింది.

నిందితుల నుండి రక్త నమూనాలను సేకరించినట్టుగా ఎన్ఐఏ తెలిపింది. ఐదు వాహనాల నమూనాలను కూడ డీఎన్ఏ మ్యాచింగ్ కోసం సేకరించినట్టుగా ఎన్ఐఏ ఇవాళ కోర్టుకు తెలిపింది.  సచిన్ వాజే ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడని ఎన్ఐఏ ఆరోపించింది.

click me!