చేపల కూరలో విషం పెట్టిన వ్యక్తి: అత్తామరదళ్ల మృతి, ఆస్పత్రిలో భార్య

By AN TeluguFirst Published Mar 25, 2021, 5:00 PM IST
Highlights

చేపల కూరలో థాలియం అనే రసాయనాన్ని కలిపి భార్య, ఆమె కుటుంబసభ్యుల మీద విషప్రయోగం చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో అత్త, మరదలు చనిపోగా భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.  ఈ ఘటనలో నిందితుడు అరుణ్ అరోరా (37)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

చేపల కూరలో థాలియం అనే రసాయనాన్ని కలిపి భార్య, ఆమె కుటుంబసభ్యుల మీద విషప్రయోగం చేశాడో వ్యక్తి. ఈ ఘటనలో అత్త, మరదలు చనిపోగా భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.  ఈ ఘటనలో నిందితుడు అరుణ్ అరోరా (37)ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

పోలీసుల కథనం ప్రకారం, 37 ఏళ్ల వరుణ్ అరోరా సద్దాం హుసేన్ నుండి స్ఫూర్తి పొందాడు. తన రాజకీయ ప్రత్యర్థులను నెమ్మదిగా చంపడానికి సద్దాం హుస్సేన్ థాలియంను ఉపయోగించేవాడు.  

భార్య, అత్త, మరదలికి అతను సర్వ్ చేసిన ఆహారంలో విషం ఉందని ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో.. మంగళవారం నాడు అరుణ్ అరోరాను దక్షిణ ఢిల్లీలోని గ్రైటర్ కైలాస్ లోని అతని ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తరువాత నిందితుడు వాళ్లు తనను అవమానించినందుకు ప్రతీకారంగానే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు. 

అరోరా అత్తగారు అనితా దేవి శర్మ మృతి తరువాత ఆమె శరీరంలో థాలియం ఆనవాళ్లు కనిపించాయని ఫోరెన్సిక్ నివేదిక రావడం, అదే సమయంలో అతని భార్య రక్తంలో విషం ఆనవాళ్ళతో ఆసుపత్రిలో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు జరిపిన తదుపరి విచారణలో, అనిత చిన్న కూతురు, ఎంఎస్ ప్రియాంక అలియాస్ ఇందర్ పూరి ఫిబ్రవరి 15న బిఎల్ కపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరణానికి కూడా థాలియం పాయిజనింగ్ కారణమని తేలింది. దీనివల్ల జుట్టు ఊడిపోవడం, బర్నింగ్ ఫుట్ సిండ్రోమ్ లక్షణాలు కూడా ఆమెలో కనిపించాయి. 

అంతేకాదు, అనిత భర్త దేవేందర్ మోహన్ శర్మ లో కూడా థాలియం పాయిజన్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. అంతేకాదు వారి ఇంట్లో పనిమనిషిలో కూడా ఇలాంటి లక్షణాలకు చికిత్స తీసుకుందని తెలిసిందని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఉర్విజా గోయెల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవన్నీ ఒక విషపదార్థ ప్రయోగం వల్ల కలిగే లక్షణాలను సూచిస్తున్నాయని అనుమానించిన పోలీసులు.. ఫోరెన్సిక్ బృందాన్ని వారి ఇంటికి పంపించి పరీక్షించగా థాలియం అవశేషాలు కనుగొన్నారు.

దర్యాప్తులో, జనవరి చివర్లో అరోరా అత్తగారి ఇంటికి వచ్చాడని ఆ సమయంలో వారికి చేపల కూర తీసుకువచ్చినట్టు తేలింది. దీంతో పోలీసులు తీవ్ర విచారణ తరువాత అరోరా నేరాన్ని ఒప్పుకున్నాడు. 

click me!