
అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనపై నెలకొన్న వివాదం ఇంకా చల్లారడం లేదు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మంత్రి ఒకరు ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతులపై విస్తృత మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మాడ్ డివిజన్ కమిటీ కమాండ్ హతం..
ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్లేందుకు గైడ్‌లైన్ రూపొందించాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను సింగపూర్‌కు పంపేందుకు ఎల్‌జీ అనుమతించకపోవడం సహేతుకం కాదని ఢిల్లీ రవాణా మంత్రి గెహ్లాట్ తన దరఖాస్తులో పేర్కొన్నారు. కాగా.. సింగపూర్ జరిగే ప్రపంచ నగరాల సదస్సు కోసం ఢిల్లీ నుంచి రావాలని ఆ దేశ ప్రభుత్వం కేజ్రీవాల్‌ను ఆహ్వానించింది. అయితే ఢిల్లీ సీఎం సింగపూర్ పర్యటనకు అనుమతి కోరుతూ ఆప్ ప్రభుత్వం జూన్ 7వ తేదీన లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫైల్ పంపించింది. అది జూలై 21వ తేదీన తిరిగి వచ్చింది. ఇది మేయర్లకు సంబంధించిన సదస్సు అని, సీఎంలు వెళ్లకూడదని గవర్నర్ కార్యాలయం నుంచి సమాధానం వచ్చింది.
దీనిపై ఆప్ స్పందించింది. ‘‘ చాలా ఆలస్యం జరిగింది. ప్రయాణ ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి జూలై 20 చివరి తేదీ. అది కూడా కూడా ముగిసింది" అని పేర్కొంది. ఆరోగ్యం, విద్య, ఇతర రంగాలలో ఢిల్లీలో చేసిన ప్రపంచ స్థాయి పనుల గురించి అంతర్జాతీయ ఫోరమ్‌లో మాట్లాడకుండా సీఎంను ఆపడం కేంద్రం ఉద్దేశమని కూడా ఆరోపించింది.‘‘ కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరి ఉండవచ్చు, కానీ ప్రపంచ సమాజంలో దేశం అవమానాన్ని ఎదుర్కొంది. ఈ విధానానికి కూడా కేంద్రమే బాధ్యత వహిస్తుంది ’’ అని తెలిపింది.
తన సింగపూర్ పర్యటనను అడ్డుకున్నందుకు సీఎం కేజ్రీవాల్ కేంద్రంపై విమర్శలు చేశారు. నేను వెళ్లి నా అభిప్రాయాన్ని ముందుకు తెచ్చి, భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచంతో పంచుకోగలిగితే బాగుండేది. దానికి నేను ఎవరినీ నిందించను ’’ అని అన్నారు. కాగా ఇదే విషయంలో గతంలో సీఎం ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాశారు. ‘‘ ఈ సదస్సుకు హాజరయ్యేందుకు అనుమతిని ఇవ్వకపోడం తప్పు. ఢిల్లీ పాలనా నమూనాను ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇంత భారీ వేదికపై దీనిని ప్రదర్శించకుండా ఒక సీఎంను అడ్డుకోవడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధం ’’ అని కేజ్రీవాల్ తాజా లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచం తెలుసుకోవాలనుకుంటుందని, ఇది దేశం గర్వించదగ్గ విషయమని తెలిపారు.
సంతానం కోసం ఖైదీకి పెరోల్.. హైకోర్టు ఆదేశంపై సుప్రీంకోర్టు ఏమన్నదంటే?
కాగా.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంత్రులు, అధికారులు విదేశాలకు వెళ్లాలంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం ఉంటుంది. అయితే ఢిల్లీ సీఎం టూర్ విషయంలో లెఫ్టనెంట్ గవర్నర్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ అనుమతి అవసరం. దీని తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి కూడా రాజకీయ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేయలేరు.