కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలా మారిపోయారు - రెజ్లర్లపై మాజీ రెజ్లర్ బబితా ఫోగట్‌ ఫైర్

Published : Jun 18, 2023, 03:50 PM ISTUpdated : Jun 18, 2023, 03:51 PM IST
 కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలా మారిపోయారు -  రెజ్లర్లపై  మాజీ రెజ్లర్  బబితా ఫోగట్‌ ఫైర్

సారాంశం

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లందరూ కాంగ్రెస్ చేతిలో కీలు బొమ్మలుగా మారారని మాజీ రెజ్లర్ల, బీజేపీకి చెందిన బబితా ఫోగట్‌ అన్నారు. రెజ్లర్ల నిరసనకు తాను ఎప్పుడు సమ్మతి తెలుపలేదని చెప్పారు. 

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా తాము చేస్తున్న నిరసన రాజకీయ ప్రేరేపితం కాదని రెజ్లర్ సాక్షి మాలిక్, ఆమె రెజ్లర్ భర్త సత్యవర్త్ కడియాన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ రెజ్లర్, బీజేపీకి చెందిన బబితా ఫోగట్ మండిపడ్డారు. వారు (నిరసన తెలుపుతున్న రెజ్లర్లు) కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారారని ఆమె ఆరోపించారు. రెజ్లర్ల లైంగిక వేధింపుల ఆరోపణలపై డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కు వ్యతిరేకంగా నెలల తరబడి నిరసన వ్యక్తం చేసిన రెజ్లర్లపై ఫోగట్ సుదీర్ఘంగా ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.

ఎమర్జెన్సీ విధించిన రోజును మరిచిపోలేం - మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ..

‘‘నిన్న నా చెల్లెలు, ఆమె భర్త వీడియో చూస్తున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. నవ్వాను. మొదట చెల్లి చూపిస్తున్న పర్మిషన్ పేపర్ లో నా సంతకం లేదా నా పేరు ఎక్కడా లేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నా సమ్మతికి రుజువు లేదు. ఇది నా ఆందోళన కూడా కాదు’’ అని ఆమె ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలని నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు తాను చెప్పినట్లు ఫోగట్‌ తెలిపారు. 

‘‘ప్రధానిపై, దేశ న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటే నిజానిజాలు తప్పకుండా బయటకు వస్తాయని మొదటి రోజు నుంచి చెబుతున్నా. ఒక మహిళా క్రీడాకారిణిగా, నేను ఎప్పుడూ దేశంలోని క్రీడాకారులందరితో ఉన్నాను. ఎప్పుడూ ఉంటాను. కానీ నిరసన ప్రారంభం నుండి నేను ఈ విషయానికి అనుకూలంగా లేను. ప్రధానమంత్రి లేదా హోం మంత్రిని కలవండి, పరిష్కారం అక్కడి నుండే ఉంటుందని నేను రెజ్లర్లందరికీ పదేపదే చెప్పాను కానీ మీరు కాంగ్రెస్ నాయకులైన దీపేందర్ సింగ్, ప్రియాంక గాంధీ వాద్రాలలో వారు పరిష్కారాన్ని చూస్తున్నారు, అత్యాచారం, ఇతర కేసుల్లో దోషులుగా తేలిన వారితో పాటు వచ్చిన వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకుల నిజస్వరూపాన్ని చూస్తున్నారు.’’ అని ఆమె అన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగాలు పోతాయా ? పీఎస్ యూలో ఉద్యోగాల తొలగింపుపై రాహుల్ గాంధీ ఫైర్

‘‘ఈ రోజు, మీ (మాలిక్, ఆమె భర్త కడియన్) ఈ వీడియో అందరి ముందు ఉన్నప్పుడు.. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున మీరు నిరసన తెలపడం, పతకాలను గంగానదిలో నిమజ్జనం చేయాలని పిలుపునివ్వడం దేశాన్ని ఇబ్బంది పెట్టడమే అని దేశ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటారు’’ అని ఆమె అన్నారు. ‘‘సోదరీ, మీరు బాదం పిండితో చేసిన రొట్టె తినొచ్చు. కానీ నేను, నా దేశ ప్రజలు గోధుమలతో చేసిన రొట్టెను తింటాము. అది అందరికీ అర్థమవుతుంది. మీరు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారారని దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ అసలు ఉద్దేశాన్ని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ’’ అని ఆమె అన్నారు.

సాక్షి మాలిక్, ఆమె భర్త విడుదల చేసిన వీడియోలో ఏముందంటే ? 
తమ నిరసన రాజకీయ ప్రేరేపితం కాదని, రెజ్లింగ్ వర్గాలు ఐక్యంగా లేనందున వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ ఏళ్ల తరబడి మౌనంగా ఉన్నామని సాక్షి మాలిక్, ఆమె రెజ్లర్ భర్త కడియాన్ శనివారం స్పష్టం చేశారు. తమ నిరసన చుట్టూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని, దానిని ఇప్పుడు క్లియర్ చేయాలని ట్విట్టర్ లో పోస్టు చేసిన వీడియోలో వారు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం