కేంద్ర మాజీ మంత్రి కమల్ మోరార్కా కన్నుమూత

By telugu news teamFirst Published Jan 16, 2021, 7:21 AM IST
Highlights

1988-94 కాలంలో కమల్ రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా జనతాదళ్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు.
 


కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ వ్యాపారవేత్త కమల్ మోరార్కా(74) అనారోగ్యంతో కన్నుమూశారు. మాజీ రాజ్యసభ సభ్యుడైన కమల్ మోరార్కా 1990-91 కాలంలో చంద్రశేఖర్ కేబినేట్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1988-94 కాలంలో కమల్ రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా జనతాదళ్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు.

పారిశ్రామికవేత్త అయిన కేంద్ర మాజీ మంత్రి  కమల్ మృతి తీరని లోటని రాజస్థాన్ రాష్ట్ర మాజీ మంత్రి రాజ్  కుమార్ శర్మ సంతాపం తెలిపారు. 1946 జూన్ 18వతేదీన మార్వాడీ కుటుంబంలో జన్మించిన కమల్ పారిశ్రామికవేత్తగా మోరార్కా ఆర్గానిక్ కంపెనీ ఛైర్మన్ గా వ్యవహరించారు. కమల్ క్రీడల పట్ల మక్కువతో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. సేంద్రీయ సేద్యం చేసిన కమల్ సోషల్ వర్కర్  గా ఎంఆర్ మోరార్కా ఫౌండేషన్ ను నెలకొల్పి షేకావతి ఫెస్టివల్ నిర్వహించారు. 
 

click me!