ఎక్స్‌క్లూజివ్: తవాంగ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం.. పనులు ప్రారంభం

By Siva KodatiFirst Published Jan 15, 2021, 9:38 PM IST
Highlights

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలోని సేలా పాస్ సమీపంలో 2022 నాటికి 13000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం నిర్మించాలని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లక్ష్యం పెట్టుకుంది

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలోని సేలా పాస్ సమీపంలో 2022 నాటికి 13000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే ఎత్తైన సొరంగం నిర్మించాలని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లక్ష్యం పెట్టుకుంది. తద్వారా మరో మైలురాయి సాధనకు సిద్ధమైంది. ఈ సొరంగాన్ని జూన్ 2022 నాటికి పూర్తి చేస్తామని ఒక అధికారి ఏషియానెట్‌కు తెలిపారు. 

సరిహద్దుల్లో చైనా హల్‌చల్ చేసినప్పుడల్లా ఆయా ప్రాంతాలకు భద్రతా దళాలను, ఆయుధాలను తరలించడం భారత్‌కు కష్టమవుతోంది. అందుకు మోడీ సర్కార్ ఈ ప్లాన్ వేసింది.  అత్యవసర పరిస్ధితుల్లో భద్రతా దళాలను, ఆయుధాలను వేగంగా తరలించేందుకు వీలుగా సేలా కనుమ మీదుగా ఈ సొరంగం తవ్వాలని నిర్ణయించింది. 

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్- పశ్చిమ కమెంగ్‌ జిల్లాల మధ్య సేలా కనుమ వుంది. ఇది చైనా సరిహద్దుల్లో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం. ఈ కనుమ మీదుగా సొరంగ నిర్మాణం చేపడితే చైనా సరిహద్దులకు దూరం తగ్గుతుంది. అటు తేజ్‌పూర్‌, ఇటు తవాంగ్ ఆర్మీ స్థావరాల మధ్య ప్రయాణ దూరం గంటపాటు తగ్గుతుంది. 

అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యంత కీలకమైన తవాంగ్ పట్టణం నుంచి భారత బలగాలు వేగంగా కదలడానికి వీలుగా భారత్‌ భారీ సొరంగాన్ని నిర్మిస్తోంది. కాగా , గతేడాది అక్టోబర్‌లో సముద్ర మట్టానికి పది వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగం అటల్ టన్నెల్‌ను హిమాచల్‌ప్రదేశ్‌లో నరేంద్రమోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దేశ సమగ్రతను కాపాడటంలో ప్రాణాలు ఆర్పించిన అమరవీరుల ధైర్య సాహసాలను స్మరిస్తూ బీఆర్‌వో డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి దాదాపు 500 కిలోమీటర్ల మేర రహదారిపై ప్రయాణించి, సొరంగం దక్షిణ పోర్టల్ వద్ద మొదటి పేలుడును నిర్వహించారు

ఆరు దశాబ్ధాలుగా భద్రతా దళాల అవసరాలను తీర్చడానికి ప్రతికూల వాతావరణ పరిస్ధితుల్లో అత్యంత కఠినమైన భూభాగంలో రోడ్లు, వంతెనలు, వైమానిక స్ధావరాలు, సొరంగాలను నిర్మించడంలో బీఆర్‌వో ప్రఖ్యాతి వహించింది.

click me!