రాజకీయాలకు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సుశీల్ కుమార్ షిండే గుడ్ బై.. ఎందుకంటే ?

By Asianet News  |  First Published Oct 25, 2023, 11:47 AM IST

కేంద్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ షిండే రాజకీయాలను వీడారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా కూడా కొంత కాలం సేవలు అందించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.


కేంద్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఓ కార్యక్రమంలో మంగళవారం వెల్లడించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన వారసురాలిగా తన కుమార్తె ప్రణీతి షిండే సోలాపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు.

విషాదం.. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు మూగ, బదిర బాలులు..

Latest Videos

తన కూతురుకు మద్దతుగా ఉంటానని చెప్పారు. కాగా..  42 ఏళ్ల ప్రణీతి షిండే షోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ కేంద్ర మంత్రి షోలాపూర్ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. షిండే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, 2012లో కేంద్ర హోం మంత్రిగా, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఇంధన శాఖ మంత్రిగా పనిచేశారు.

బైక్ పై వెళ్తున్న దంపతులను అడ్డగించి.. భర్తను చితకబాది, భార్యపై గ్యాంగ్ రేప్..

70వ దశకం ప్రారంభంలో రాజకీయాల్లోకి వచ్చిన షెండే మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. షిండే 2003 జనవరి నుంచి 2004 నవంబరు వరకు కొద్దికాలం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1971లో షిండే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1974, 1980, 1985, 1990, 1992లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.  ఆగష్టు 2004-(జనరల్) ఉప ఎన్నికలు, సెప్టెంబర్ 2004 నుండి అక్టోబర్ 2004 వరకు-(జనరల్). 1992 జూలై నుంచి 1998 మార్చి వరకు మహారాష్ట్ర నుంచి షిండే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ప్రచార మేనేజర్ గా వ్యవహరించారు.

చారిత్రక తప్పిదాలను పరిష్కరించడానికి సమ్మిళిత న్యాయ వ్యవస్థ అవసరం - సీజేఐ చంద్రచూడ్

2002లో ఉపరాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో షిండే జాతీయ ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థి భైరాన్ సింగ్ షెకావత్ పై పోటీ చేసి ఓడిపోయారు. 2004 అక్టోబరు 30 న ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉన్న సుర్జిత్ సింగ్ బర్నాలా స్థానంలో షిండే గవర్నరుగా నియామకం అయ్యారు. 2006 జనవరిలో ఆయన పదవి నుంచి వైదొలిగారు. అనంతరం ఆయన 2006 నుంచి 2012 వరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012లో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

click me!