Panneerselvam:  క‌రోనా బారిన ప‌డ్డ తమిళనాడు మాజీ సీఎం..  ఐసోలేష‌న్ వార్డులో చికిత్స‌

Published : Jul 16, 2022, 06:50 PM IST
Panneerselvam:  క‌రోనా బారిన ప‌డ్డ తమిళనాడు మాజీ సీఎం..  ఐసోలేష‌న్ వార్డులో చికిత్స‌

సారాంశం

Panneerselvam: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం క‌రోనా బారిన పడ్డారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి  కాస్త విషమించ‌డంతో చెన్నైలోని MGM హెల్త్‌కేర్‌లో చేరాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న గురించి MGM హెల్త్‌కేర్ హాస్పిటల్ ఒక బులెటిన్ విడుదల చేసింది.

Panneerselvam: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం క‌రోనా బారిన పడ్డారు. గ‌త రెండు రోజులుగా స్వల్ప లక్షణాలతో బాధ‌ప‌డుతున్నఆయ‌న శుక్రవారం పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్లు వెల్ల‌డించారు. అయితే.. ప‌రిస్థితి  కాస్త విషమించ‌డంతో చెన్నైలోని MGM హెల్త్‌కేర్‌లో చేరాడు. 
ఈ క్ర‌మంలో ఆయ‌న ఆరోగ్య ప‌ర‌స్థితి గురించి MGM హెల్త్‌కేర్ హాస్పిటల్ ఒక బులెటిన్ విడుదల చేసింది.

ఆ బులెటిన్ లో పన్నీర్‌సెల్వం తేలికపాటి కరోనా లక్షణాలతో జూలై 15న ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేరారనీ, ప్రస్తుతం ఆయన వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణుల బృందం సూచనల మేరకు చికిత్స అందిస్తున్నారని పేర్కొంది. 
పన్నీర్ సెల్వం త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. 

ఇదిలాఉంటే.. గ‌త కొద్ది రోజుల క్రితం అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) నుంచి పన్నీర్ సెల్వం బహిష్కరణకు గురయ్యారు. అన్నాడీఎంకే పార్టీని కైవసం చేసుకునేందుకు జులై 11న వానగరంలో సాధారణ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, అందులో పన్నీర్‌సెల్వం కూడా పాల్గొనడం గమనార్హం. ఆయన వెంట ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. అదే సమయంలో గత కొద్ది రోజులుగా ఆయన నివాసం వద్ద పార్టీ నేతల సందడి నెలకొంది.

 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?