
Delhi High Court: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెల్లువరించింది. అవివాహిత మహిళ పరస్పర అంగీకరంతో గర్భాన్ని దాల్చినా.. 23 వారాల తర్వాత ఆ పిండాన్నిలేదా గర్భాన్ని తొలగించేందుకు అనుమతించరాదని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆ సమయంలో పిండాన్ని తొలగించడం అంటే భ్రూణ హత్యకు పాల్పడినట్టేనని కోర్టు చెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
వివరాల్లోకెళ్తే... 25 ఏండ్ల అవివాహిత యువతి తన 24 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. ఆమె ఏకాభిప్రాయంతో తన స్నేహితుడితో సహాజీవనం చేసింది. కానీ, తన స్నేహితుడు తనని వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని కోర్టుకు తెలిపింది. వివాహేతర ప్రసవం.. తనకు మానసిక వేదనతో పాటు సామాజిక కళంకాన్ని కలిగిస్తుందని, అలాగే తల్లిగా ఉండటానికి మానసికంగా సిద్ధంగా లేదని చెప్పింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం న్యాయస్థానం తన అధికారాన్ని ఉపయోగించుకునేటప్పుడు చట్టానికి మించి వెళ్లదని పేర్కొంది. అవివాహిత మహిళ ఏకాభిప్రాయ సంబంధం కారణంగా గర్భం దాల్చింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్- 2003లోని క్లాజులు ఏవీ స్పష్టంగా కవర్ చేయబడవని, జూలై 15 నాటి ఆర్డర్‌లో కోర్టు పేర్కొంది.
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రూల్స్ 2003 (ఇది పెళ్లికాని స్త్రీలను మినహాయిస్తుంది) యొక్క రూల్ 3B నిలుస్తుంది. ఈ న్యాయస్థానం భారత రాజ్యాంగం, 1950లోని ఆర్టికల్ 226 ప్రకారం తన అధికారాన్ని చలాయిస్తున్నప్పుడు, చట్టాన్ని దాటి వెళ్లకూడదని చెప్పింది. శుక్రవారం విచారణ సందర్భంగా, పిటిషనర్‌ను 23 వారాలలో వైద్యపరంగా పిండాన్ని తొలగించడానికి అనుమతించబోమని, అది భ్రూణ హత్యగా కోర్టు పేర్కొంది. అవివాహిత స్త్రీలకు గర్భం తీసువేసుకోవడానికి చట్టం కొంత సమయం ఇచ్చిందనీ, 20 వారాల తర్వాత ఎట్టిపరిస్థితుల్లో తొలగించడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది .పిండాన్ని తొలగించడం అంటే భ్రూణ హత్యకు పాల్పడినట్టేనని కోర్టు చెప్పింది.
అయితే అమ్మాయిని ఎక్కడైనా సురక్షితంగా ఉంచాలనీ, శిశువుకు జన్మనిచ్చే వరకు వాళ్ల బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది. పుట్టబోయే పిల్లవాడిని పెంచాలని తాము అనడం లేదని, తొలుత ఆ అమ్మాయిని మంచి హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని, వారి వివరాలను బయటకు వెల్లడించారని తెలిపింది. తరువాత పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్లు చాలా మంది ఉన్నారనీ, దత్తత కోసం పెద్ద క్యూ కడుతున్నారని కోర్టు పేర్కొంది.