రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కి విందు... మన్మోహన్ దూరం

Published : Feb 25, 2020, 09:44 AM IST
రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కి విందు...  మన్మోహన్ దూరం

సారాంశం

ఈ విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు కూడా హాజరుకానున్నారు. అయితే.. ఈ విందుకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కావడం లేదు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయానికి ఆయన సమాచారం కూడా అందించారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం  ట్రంప్ రాష్ట్రపతి భవన్ కి వెళ్లనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు.

Also Read మెలానియా ట్రంప్ డ్రెస్: పారిస్ నుండి తెప్పించి....

ఈ విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు కూడా హాజరుకానున్నారు. అయితే.. ఈ విందుకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరు కావడం లేదు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయానికి ఆయన సమాచారం కూడా అందించారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆహ్వానం అందలేదని.. అలాంటప్పుడు తాము విందులో ఎలా పాల్గొంటామని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నట్లు సమాచారం.దాదాపు కాంగ్రెస్ పార్టీ ఈ విందుకు దూరంగా ఉండనట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఈ విందుకు తాము దూరంగా ఉంటున్నామని కాంగ్రెస్ నేతలు ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం