18 రోజుల తర్వాత ఎయిమ్స్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జీ

By telugu teamFirst Published Oct 31, 2021, 7:17 PM IST
Highlights

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఆయన డిశ్చార్జీ అయినట్టు తెలిసింది.
 

న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి Manmohan Singh ఆరోగ్యం కుదుటపడింది. అనారోగ్య సమస్యల నుంచి ఆయన కోలుకున్నారు. అందుకే ఈ రోజు ఢిల్లీలోని AIIMS నుంచి Discharge అయ్యారు. ఆదివారం సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో ఆయన డిశ్చార్జీ అయినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం బాగున్నదని Hospital సిబ్బంది ఒకరు వివరించారు. గత 18 రోజులుగా ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. తీవ్ర జ్వరం, అలసట కారణంగా అక్టోబర్ 13వ తేదీన ఆయన Delhiలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు.

డాక్టర్ నితీశ్ నాయక్ సారథ్యంలోని వైద్య బృందం డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు చికిత్సనందించారు. చాలా సంవత్సరాల నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ ఫిజిషియన్‌గా సేవలందిస్తున్నారు. ఆయన కార్డియాలజీ విభాగంలో ప్రొఫెసర్.

Also Read: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు డెంగ్యూ.. ఎయిమ్స్ అధికారులు ఏం చెప్పారంటే?

మన్మోహన్ సింగ్‌కు చికిత్స అందించిన ఈ కాలంలోనే ఆయనకు డెంగ్యూ వచ్చినట్టూ కొన్ని వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత దీనిపై అధికారిక ప్రకటనలేవీ రాలేవు. కానీ, ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్టు తాజాగా తెలియవచ్చింది.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ సమయంలో మన్మోహన్ సింగ్‌ కొవిడ్-19 బారినపడ్డారు. అప్పుడూ ఇదే ఎయిమ్స్‌లో చేరి చికిత్స తీసుకున్నారు. గతేడాది మే నెలలోనూ ఛాతిలో నొప్పి రావడంతో ఇందులోనే అడ్మిట్ అయ్యారు.

తీవ్ర జ్వరంతో ఈ నెల 13న  ఆయన ఎయిమ్స్‌లో చేరగానే దేశంలోని ప్రముఖులందరూ ఆయన వేగంగా కోలుకోవాలని, క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి అశ్వని కుమార్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. 

Also Read: ‘2జీ’ ఆరోపణలు వెనక్కి.. కాంగ్రెస్ నేతకు మాజీ కాగ్ వినోద్ రాయ్ క్షమాపణలు

మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన తర్వాతి రోజు రాహుల్ గాంధీ హాస్పిటల్ వెళ్లారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరణ్ కౌర్‌ను ఓదార్చారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను పరామర్శించడానికి వెళ్లి ఆయనతో ఫొటో దిగిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బీజేపీకి ప్రతి ఒక్కటి ఫొటో ప్రచారం చేయడానికే అనుగుణమైనవిగానే కనిపిస్తాయని మండిపడింది. మన్మోహన్ సింగ్‌ను పరామర్శించడానికి వెళ్లడమూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయాకు పీఆర్ స్టంట్ మాదిరిగానే కనిపిచిందని ఆగ్రహించింది. మాజీ ప్రధాని గోప్యతను భంగపరచడమే కాదు, కనీస నైతిక విలువలు మరిచిపోయి, సంప్రదాయాలను విస్మరించిన కేంద్ర మంత్రి మాండవీయా వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు.

రెండు సార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు అన్ని పార్టీల నుంచి అభిమానులున్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, నిర్ణయాలపై ఇప్పటికీ ప్రశంసలు వస్తూనే ఉన్నాయి.

click me!