తాగి వధువు చేయి పట్టుకు లాగిన పెళ్లికొడుకు ఫ్రెండ్స్.. క్యాన్సిలైన పెళ్లి....

By AN TeluguFirst Published Dec 14, 2020, 4:29 PM IST
Highlights

స్నేహితుడి పెళ్లికి వెళ్లి వధువును చేయి పట్టుకు లాగారు స్నేహితులు. వీరి ప్రవర్తన భరించలేని వధువు నాకా పెళ్లీ వద్దు, వరుడూ వద్దూ అంటూ వచ్చేసింది. దీంతో సంతోషంగా ముగియాల్సిన పెళ్లి వేడుక విషాదంగా మారింది. 

స్నేహితుడి పెళ్లికి వెళ్లి వధువును చేయి పట్టుకు లాగారు స్నేహితులు. వీరి ప్రవర్తన భరించలేని వధువు నాకా పెళ్లీ వద్దు, వరుడూ వద్దూ అంటూ వచ్చేసింది. దీంతో సంతోషంగా ముగియాల్సిన పెళ్లి వేడుక విషాదంగా మారింది. 

ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన ఈ సంఘటన  ఆలస్యంగా వెలుగు చూసింది. మద్యం మత్తులో స్నేహితులు చేసిన తొందరపాటు పనికి పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. వరుడి స్నేహితులు డ్యాన్స్‌ చేయాలంటూ వధువును బలవంతపెట్టడంతో పెళ్లి ఆపుచేసుకున్నారు ఆమె కుటుంబసభ్యులు. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనౌజ్‌ జిల్లాకు చెందిన ఓ యువతికి బరేలీకి చెందిన యువకుడితో కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం పెళ్లి రోజు కావటంతో మేలతాళాలతో పెళ్లికూతురు తరుపు వారు బరేలిలోని పెళ్లి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో తాళి కట్టే తరుణం ఆసన్నమవుతుందనగా.. పెళ్లి కుమారుడి స్నేహితులు పెళ్లి కూతుర్ని డ్యాన్స్‌ చేయాలంటూ బలవంతంగా డ్యాన్స్‌ ఫ్లోర్ మీదికి లాక్కెళ్లారు. 

దీంతో షాక్ అయిన పెళ్లి కూతురు కుటుంబం వారి ప్రవర్తన పట్ల అభ్యంతరం తెలిపింది. వరుడు, వధువు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులను రంగంలోకి దింపారు. అధికంగా కట్నం అడుగుతున్నారంటూ పెళ్లి కుమారుడి కుటుంబంపై పెళ్లి కూతురి కుటుంబం ఫిర్యాదు చేసింది. 

పోలీసుల మధ్యవర్తిత్వంతో పెళ్లి కుమారుడి కుటుంబం 6.5 లక్షల రూపాయులు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయింది. పెళ్లి జరిపించటానికి వరుడి తరుపు వారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనకు మర్యాద ఇవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది.
 

click me!