‘మీ వల్ల న్యాయం జరిగే ఆశ లేదు. సెప్టెంబర్ 13న హత్య చేస్తాం...’ రాజస్థాన్ జడ్జికి బెదిరింపు లేఖ

Published : Aug 19, 2021, 03:49 PM IST
‘మీ వల్ల న్యాయం జరిగే ఆశ లేదు. సెప్టెంబర్ 13న హత్య చేస్తాం...’ రాజస్థాన్ జడ్జికి బెదిరింపు లేఖ

సారాంశం

మీ వల్ల న్యాయం జరుగుతుందని ఆశ లేదు. అందుకే మిమ్మల్ని సెప్టెంబర్ 13న హత్య చేస్తున్నాం’ అని లేఖలో చెప్పాడు. మీ ఇంటిని బాంబులతో పేల్చివేద్దామనుకున్నాం. కానీ మీ కుటుంబ సభ్యులు మాకు ఎలాంటి హాని చేయలేదు. అందుకే వెనక్కి తగ్గాం. మిమ్మల్ని తుపాకీతో కాల్చి లేదా విషమిచ్చి, వాహనంతో ఢీకొట్టి.. ఎలాగైనా చంపేస్తాం. 

ఝార్ఖండ్ లో ఓ న్యాయమూర్తిని గత నెలలో ఆటోతో ఢీ కొట్టి హత్య చేసిన సంఘటన మరువకముందే రాజస్థాన్ లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బూందీ జిల్లా సెషన్స్ జడ్జి సుధీర్ పారిక్ ను చంపేస్తానంటూ ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ రాశాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, న్యాయమూర్తికి భద్రత పెంచారు. హిందీలో రాసిన ఆ లేకలో జడ్జికి ఆగంతకుడు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. జడ్జి వల్ల తమకు న్యాయం జరుగుతుందన్న భరోసా లేదని, అందుకే మాఫియా సాయంతో హత్యకు ప్రణాళిక రచించినట్లు తెలిపాడు. 

‘మీ వల్ల న్యాయం జరుగుతుందని ఆశ లేదు. అందుకే మిమ్మల్ని సెప్టెంబర్ 13న హత్య చేస్తున్నాం’ అని లేఖలో చెప్పాడు. మీ ఇంటిని బాంబులతో పేల్చివేద్దామనుకున్నాం. కానీ మీ కుటుంబ సభ్యులు మాకు ఎలాంటి హాని చేయలేదు. అందుకే వెనక్కి తగ్గాం. మిమ్మల్ని తుపాకీతో కాల్చి లేదా విషమిచ్చి, వాహనంతో ఢీకొట్టి.. ఎలాగైనా చంపేస్తాం. 

న్యాయస్థానంలో నిందితుడికి మీరు ఎలా అవకాశమిస్తారో, మేమూ రక్షించుకోవడానికి మీకో అవకాశమిస్తున్నాం. ఈ హత్య గురించి పోలీసులకూ సమాచారమిచ్చాం’ అని లేఖలో ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ ఘటన మీద పోలీసులు విచారణ ప్రారంభించారు. 
 

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?