కదులుతున్న కారులో మహిళ మీద అత్యాచారం.. ఆ తరువాత పార్క్ దగ్గర...

Published : Aug 19, 2021, 02:58 PM IST
కదులుతున్న కారులో మహిళ మీద అత్యాచారం.. ఆ తరువాత పార్క్ దగ్గర...

సారాంశం

కారు వెనక సీటులో కూర్చున్న వ్యక్తి మొదట ఆమె మీద దాడి చేశారు. ఆ తరువాత అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా నిందితులు బెదిరించనట్లు పేర్కొన్నారు. 

న్యూ ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. మహిళ మీద కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను గుర్తు చేస్తోంది. 

ఘజియాబాద్ కు చెందిన మహిళ మీద కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వివరాలు తెలిపిన ప్రకారం.. నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడి బాధిత మహిళను ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనమీద కేసు నమోదు చేశారు. గురువారం వీరిమీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. 

కారు వెనక సీటులో కూర్చున్న వ్యక్తి మొదట ఆమె మీద దాడి చేశారు. ఆ తరువాత అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా నిందితులు బెదిరించనట్లు పేర్కొన్నారు. కాగా పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లో కారును గుర్తించినట్లు వెల్లడించారు. 

దాని సాయంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా, ఆగస్ట్ 16న జరిగిన ఈ ఘటన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్