ఆసుపత్రి నుండి శశికళ డిశ్చార్జ్: మరికొన్ని రోజులు బెంగుళూరులోనే చిన్నమ్మ

Published : Jan 31, 2021, 01:01 PM IST
ఆసుపత్రి నుండి  శశికళ డిశ్చార్జ్: మరికొన్ని రోజులు బెంగుళూరులోనే చిన్నమ్మ

సారాంశం

 ఎఐడీఎంకె మాజీ నేత శశికళ బెంగుళూరులోని ఆసుపత్రి నుండి ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో జైలు నుండి ఆసుపత్రిలో చేరిన శశికళ ఇవాళ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

బెంగుళూరు: ఎఐడీఎంకె మాజీ నేత శశికళ బెంగుళూరులోని ఆసుపత్రి నుండి ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో జైలు నుండి ఆసుపత్రిలో చేరిన శశికళ ఇవాళ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

బెంగుళూరు నుండి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న సమయంలోనే ఆమె జైలు నుండి విడుదలయ్యారు. ఆసుపత్రిలోనే ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను జైలు అధికారులు పూర్తి చేశారు.

also read:జైలు నుండి శశికళ విడుదల: పత్రాలు అందించిన అధికారులు

ఆమె ఆరోగ్యంగా ఉన్నందున ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు శనివారం నాడు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన కరోనాతో ఆమె ఆసుపత్రిలో చేరారు. అక్రమాస్తుల కేసులో శశికళను ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 1600 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.

మరో పది రోజుల పాటు  బెంగుళూరులోనే శశికళ ఉండే అవకాశం ఉందని సమాచారం.
 

PREV
click me!

Recommended Stories

Delhi: మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన జంత‌ర్‌మంత‌ర్‌.. రాహుల్, ప్రియాంక సహా విపక్ష ఎంపీల అరెస్ట్
ఢిల్లీలో అసలేం జరుగుతోంది? మళ్లీ కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం