త్రివర్ణ పతాకానికి అవమానం బాధించింది: మన్‌కీ బాత్ లో ప్రధాని మోడీ

By narsimha lodeFirst Published Jan 31, 2021, 12:38 PM IST
Highlights

ఎర్రకోటపై జరిగిన దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఖండించారు.ఈ ఘటన చూసిన భారత్ మొత్తం దు:ఖించిందన్నారు. 

న్యూఢిల్లీ:ఎర్రకోటపై జరిగిన దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఖండించారు.ఈ ఘటన చూసిన భారత్ మొత్తం దు:ఖించిందన్నారు. 

ఎర్రకోట ఘటన దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం తనకు బాధకల్గించిందన్నారు. రానున్న రోజులను ఆశతో కొత్తదనంతో నింపాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ఆసీస్ గడ్డపై భారత క్రికెటర్లు సత్తా చాటారని ఆయన చెప్పారు. దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లను ఇతర దేశాలకు కూడ పంపిణీ చేస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఈ నెల మొదటి వారంలో బెంగుళూరుకు  పెద్ద విమానాన్ని నడిపిన నలుగురు మహిళా పైలెట్ల గురించి ఆయన ప్రస్తావించారు. ఇండియన్ పైలెట్ల కృషిని ఆయన అభినందించారు.

కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ గురించి కూడ ఆయన స్పందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచంలోనే అతి పెద్దదని ఆయన చెప్పారు. కరోనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఇండియా ముందుందన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వేయడమే తమ ప్రాధాన్యత అని ఆయన చెప్పారు.

కరోనాపై భారత్ పోరాటం ఏడాది పూర్తైంది. కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన యుద్దం ప్రపంచానికి ఒక ఉదహరణగా ఆయన చెప్పారు.  స్వాతంత్ర్య సమరయోధుల గురించి దానితో సంబంధం ఉన్న సంఘటనల గురించి పుస్తకాలను రాయాలని ఆయన కోరారు. ఈ ఘటనలు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన చెప్పారు.

కేరళలోని కొట్టాయం ప్రాంతానికి చెందిన దివ్యాంగ వృద్దుడు పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వడాన్ని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  వెంబనాడ్ సరస్సులో ప్లాస్టిక్ బాటిళ్లను అడ్డుకోవడం వంటి వాటిని చేయడాన్ని ఆయన గుర్తు చేశారు.

పండుగలు, ఉత్సవాలు, గణతంత్ర వేడుకలు, బడ్జెట్ సమావేశాల ప్రారంభం వంటి కార్యక్రమాలతో జనవరి నెల మొత్తం గడిచిపోయిందన్నారు. పలు రంగాల్లో విశేష సేవలు చేసిన వారిని పద్మ పురస్కారాలతో గౌరవించుకొన్నట్టుగా ఆయన ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
 

click me!